మిల్లెట్ మురుకులు తయారీ.. ఉపయోగాలు

మిల్లెట్ మురుకులు తయారీ.. ఉపయోగాలు

మిల్లెట్ మురుకులు తయారీ.. ఉపయోగాలు

 

మిల్లెట్ మురుకులు

కావాల్సిన పదార్థాలు: 

మిల్లెట్స్ ( ఏవైనా)      - అర కిలో

పెసర పప్పు               - 100 గ్రా.

మినప పప్పు              - 50 గ్రా.

నువ్వులు                   - 4 టీ స్పూన్లు

జీలకర్ర / వాము         - ఒక టీ స్పూన్

నూనె                         - తగినంత

కారం, ఉప్పు              - తగినంత

తయారీ విధానం:

ముందుగా పెసరపప్పు, మినపప్పు, మిల్లెట్స్ ను బాగా వేయించాలి. తరువాత అవి పిండిలా అయ్యే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమంలో కాస్త వాము, నువ్వులు, తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో గరిటెడు వెన్నతో పాటు కొద్ది కొద్దిగా నీళ్లు వేసి పిండి ముద్ద కలుపుకోవాలి. తరువాత దీన్ని మురుకుల్లా వత్తుకోవాలి.  మురుకులు బంగారు గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించుకుని తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తరువాత గాలి చొరబడని కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి.

ప్రయోజనాలు:

మిల్లెట్స్ తో తయారుచేసిన మురుకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. మిల్లెట్స్ గా ( జొన్నలు / కొర్రలు / సజ్జలు) తీసుకోవచ్చు. ఇందులో జొన్నలు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొర్రల్లో ప్రోటీన్ లు అధికంగా ఉండటంతో.. కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు మరియు స్థూలకాయం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక సజ్జలు..జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 

సాధారణంగా మిల్లెట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్, ఇతర విటమిన్లు ఉండటంతో ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి.  మినరల్స్ మరియు మాంసకృతులు వంటి పలు పోషకాలను కలిగి ఉంటాయి. మిల్లెట్ తో చేసిన మురుకులను స్నాక్స్ గా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

 


© 2023 - 2024 Millets News. All rights reserved.