రాగులు ( ఫింగర్ మిల్లెట్స్) లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. వీటినే ‘నాచ్ని’ అని పిలుస్తారు. పురాతన చిరుధాన్యాలలో ప్రధానమైన రాగుల పిండితో తయారు చేసిన వంటకాలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్న సంగతి తెలిసిందే. రాగి ఇడ్లీ తినడం వలన మన శరీరానికి పోషక పదార్థాలను అందిస్తుంది. అలాగే ఇది గ్లూటెన్ ఫ్రీ. చిన్నారులు, మహిళలు రాగి ఇడ్లీలను తినడం వలన నీరసం దరిచేరదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ భారతదేశంలో రాగులు ప్రధాన ఆహారంగా ఉంది. అంతేకాదు ఇతర ధాన్యాల కంటే రాగులు చాలా బలవర్ధకమైనవి. వీటిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, మినరల్స్ మరియు అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ ధాన్యం లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది. రాగులతో తయారు చేసిన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు గ్లూటెన్ లోపంతో బాధపడేవారికి రాగులు దివ్య ఔషధమని చెప్పుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ బియ్యంను తీసుకోవాలి. బాగా కడిగిన తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పోహా ( రవ్వ)ను కడిగి తీసుకోవాలి. మరో గిన్నెలో మినపప్పు, మెంతి గింజలను తీసుకుని.. కప్పు నీటిలో సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటన్నింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిలో నానబెట్టిన రవ్వను వేసుకుని బాగా కలపాలి. తరువాత ఒక కప్పు రాగి పిండిని కూడా జోడించి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు పులియనివ్వాలి. మరుసటి రోజు ఆ మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ స్టాండ్ లో పిండిని వేసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ రాగి ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేసుకోండి.
© 2023 - 2024 Millets News. All rights reserved.