ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మరి వచ్చినప్పుడు నుండి, ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలు బారిన పడకూడదని ఆరోగ్యంగా ఉండడం కోసం, పలు ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చుకోవడం జరిగింది. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటి..?, మిల్లెట్స్ ని తీసుకోవడం వలన మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంది. మీరు కూడా మిల్లెట్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? మిల్లెట్స్ తో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.
మిల్లెట్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. మన పూర్వీకులను చూసుకున్నట్లయితే వాళ్ళు గోధుమలు, బియ్యం కంటే మిల్లెట్స్ ని ఎక్కువగా ఉపయోగించేవారు. మిల్లెట్స్ లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ శరీరానికి హాని కలిగిస్తుంది. అయితే, మిల్లెట్స్ లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటుగా మైక్రో న్యూట్రిఎంట్స్ కూడా ఉంటాయి. సో, మిల్లెట్స్ ని తీసుకోవడం వలన శారీరికంగా మానసికంగా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. మిల్లెట్స్ లో ఫైబర్ జీర్ణ క్రియ ని మెరుగుపరుస్తుంది. మలబద్దకం ని నివారిస్తుంది. బాడీలో కొవ్వు నిల్వలు లేకుండా మిల్లెట్స్ చూసుకుంటాయి. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన గుండెకి (heart health) కూడా మేలు కలుగుతుంది.
మిల్లెట్స్ లోని విటమిన్ బి3 లేదా నియాసిన్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళకి దివ్య ఔషధం. అధిక బరువుతో బాధపడేవాళ్లు ఊబకయంతో (obesity) బాధపడే వాళ్ళు రెగ్యులర్ గా మిల్లెట్స్ ని తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది. అన్నం, గోధుమలు తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిల్లెట్స్ ని తింటే టైప్ టు డయాబెటిస్ (type 2 diabetes) వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. చూశారా మిల్లెట్స్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయో. మిల్లెట్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అనేక సమస్యలకి చెక్ పెట్టవచ్చు. మరెందుకు ఆలస్యం డైట్ లో మిల్లెట్స్ ని చేర్చుకోండి మరింత ఆరోగ్యంగా ఉండండి. ఈ సమస్యలకి గుడ్ బై చెప్పేయండి.
© 2023 - 2024 Millets News. All rights reserved.