లిటిల్ మిల్లెట్స్ తో గుండె జబ్బులు మాయం..!!

లిటిల్ మిల్లెట్స్ తో గుండె జబ్బులు మాయం..!!

లిటిల్ మిల్లెట్స్ తో గుండె జబ్బులు మాయం..!!

 

చిరుధాన్యాలలో లిటిల్ మిల్లెట్స్ ఒకటి. వీటినే తెలుగులో సామలు అని పిలుస్తారు.  రాగులు, కొర్రలు, అరికలు, సజ్జలు, ఊదలు తరహాలో చాలా రకాల తృషధాన్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సామల్లో ఉండే పోషకాలు, వాటిని రోజూవారీ ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో మిల్లెట్స్ పై అవగాహన పెరుగుతుంది. దీంతో ప్రజలు తమ ఆహరంలో చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సామలను తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వీటిలో ఉండే అధిక మెగ్నీషియం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సామల్లో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఫాస్పరస్ అధిక బరువును తగ్గించడంతో పాటు కణాల్లో పునరుజ్జీవానికి తోడ్పడుతుందని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. 

సామలలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోని ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులను నియంత్రించడంతో పాటు హార్మోన్ల అసమతుల్యత సమస్యలను అదుపులో ఉంచుతుంది. 

శ్వాసకోశ వ్యాధుల నుంచి సామలు ఉపశమనం కలిగిస్తాయి. ఆస్తమాతో బాధపడేవారికి సామలు మంచి ఆహార ఎంపికని చెప్పుకోవచ్చు. ఇవి గ్లూటెన్ ఫ్రీ కావడంతో సెలియాక్ వ్యాధి బారిన పడిన వారికి సామలు ప్రత్యామ్నాయ ఆహారంగా పని చేస్తుంది. అదేవిధంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, టోకో ఫెరోల్స్, టోకోట్రైనోల్స్, కెరటెనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కెరటెనాయిడ్స్ శరీరంలో వ్యాధి నిరోధకతను పటిష్టం చేయడంలో దోహదపడుతుంది. ఇక టోకో ఫెరోల్స్, టోకోట్రైనోల్స్ విటమిన్ -ఈ ఆక్టివిటీని కలిగి ఉండటం వలన నరాలు, కండరాలు మరియు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎర్ర రక్తకణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. 

సాధారణంగా వంద గ్రాముల సామల్లో 9.6 గ్రా. ప్రోటీన్, 60.5 గ్రా. కార్బోహైడ్రేట్స్, 5 గ్రా ఫ్యాట్, 9.3 మి.గ్రా. ఐరన్, 220 మి.గ్రా ఫాస్పరస్, 17 మి.గ్రా కాల్షియం, 114 మి.గ్రా మెగ్నీషియం, 3.2 మి.గ్రా నియాసిన్, 0.30 మి.గ్రా థయామిన్, 0.09 మి.గ్రా రైబోఫ్లావిన్, 7.7 గ్రా. ఫైబర్ తో పాటు  325 క్యాలరీల ఎనర్జీ ఉంటుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. 

సామలను ఏ రూపంలో తీసుకున్న తేలికగా జీర్ణం అవుతాయి. అజీర్తి, అతిసారం వంటి సమస్యలకు వీటితో చెక్ పెట్టొచ్చు. అదేవిధంగా సామలను తినడం వలన ఆడవారి రుతు సమస్యలకు కూడా మంచిది. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు సామలు తినడం వలన ఉపశమనం పొందవచ్చు. అయితే చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకునే వారు పోషకాహార నిపుణలు సూచనల మేరకు తగిన మోతాదులో తీసుకోవడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.