ఒక సాధారణ మహిళ నుండి మిల్లెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిన లహరి భాయి

ఒక సాధారణ మహిళ నుండి మిల్లెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిన లహరి భాయి

ఒక సాధారణ మహిళ నుండి మిల్లెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిన లహరి భాయి

ప్రతి కంపెనీ తమ ప్రోడక్ట్ మార్కెట్లో బాగా అమ్ముడు పోవడానికి సెలబ్రిటీల చేత తమ ప్రాజెక్టు యొక్క ప్రమోషన్లను చేయిస్తారు. ఫిలిం స్టార్స్, హీరోయిన్స్ అలాగే క్రికెట్ స్టార్స్ చేత ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు గురించి చెప్పి వాటిని ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్తారు. ఇలా చేయడం ద్వారా ప్రాజెక్టు కూడా త్వరగా అమ్ముడుపోతుంది. ఎవరైనా సరే తమ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తిని ఉపయోగించుకుంటారు. బ్రాండ్ అంబాసిడర్ అంటే తప్పకుండా అందరికీ తెలిసిన వారయ్యే ఉంటారు. కానీ మీకు మిల్లెట్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు తెలుసా? ఈ ప్రశ్న అడగగానే ఫేమస్ సెలబ్రిటీల పేర్లు గుర్తుకు వచ్చి ఉండవచ్చు.. కానీ మన దేశ మిల్లెట్ స్ బ్రాండ్ అంబాసిడర్ ఒక సాధారణ మహిళ. ఆమె ఒక రైతు. ఆమె పేరు లహరి బాయి….

భారతదేశాన్ని చిరుధాన్యాల సాగుకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజన మహిళ అయినా లహరిబాయి ని “ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్” బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఈమె మధ్యప్రదేశ్  లో నీ బైగా తెగకు సంబంధించిన గిరిజన మహిళ. ఇంతగా బలహీనమైన గిరిజన తెగ. ఈ బైగా తెగ ప్రజలు ధాన్యం పట్ల అలాగే విత్తనాల పట్ల చాలా అవగాహన కలిగి ఉంటారు. ప్రకృతి అలాగే జీవవైవిద్యం పట్ల లోతైన జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. లహరిబాయి తన వద్ద ఉన్న ధాన్యాలతో ఒక బ్యాంకుని ఏర్పాటు చేసింది. ఆ బ్యాంక్ పేరే బీజ్ బ్యాంక్. హిందీలో బీజ్ అనగా విత్తనం అని అర్థం.

 లహరి బాయి డీండోరీ జిల్లాలోని శిల్పాడి అని మారుమూల గ్రామానికి చెందిన స్త్రీ. లహరికి వ్యవసాయం చేయడమంటే ఎంతో ఇష్టం. తమ తెగవారు చేసే సాంప్రదాయమైన వ్యవసాయాన్ని ఆమె చిన్న నేర్చుకోవడం మొదలుపెట్టింది. వ్యవసాయం గురించి అలాగే విత్తనాల గురించి లహరిబాయి బామ్మ ఆమెకు రకరకాల విషయాలు చెబుతూ ఉండేవారు. ధాన్యం యొక్క ప్రాముఖ్యత కూడా తెలియజేసేవారు. అలా బామ్మ గారు ఇచ్చిన ప్రేరణతో 18 సంవత్సరాల వయసు నుండి లహరిబాయి రకరకాల ధాన్యాల విత్తనాలను దాచిపెట్టడం మొదలు పెట్టింది. ఆమెకు సమయం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల గ్రామాల్లో మరియు అడవుల్లో తిరుగుతూ రకరకాల విత్తనాలను సేకరించి దాచిపెడుతూ ఉంటుంది.

  ఎన్నో రకాల ధాన్యాలను సేకరించినప్పటికీ ఆమెకు చిరుధాన్యాల పట్ల అభిమానం ఎక్కువగా ఉండేది. ఆమె తన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నవారికి చిరుధాన్యాల యొక్క ఉపయోగాన్ని తెలియజేసి వాటి సాగుని పెంచాలి అని రకరకాల ప్రయత్నాలు చేసేది. ఆమె తన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రజలతో చిరుధాన్యాల యొక్క ఉపయోగాలు విధి తెలియజేసేది. ఎప్పుడూ బడికి వెళ్ళని ఆమె చిరుధాన్యాల ఉపయోగాలు గురించి చెబుతూ ఉంటే గ్రామాలలోని వారంతా ఆశ్చర్యపోయేవారు. అని ప్రతి ఒక్కరికి ఉచితంగా విత్తనాలను ఇవ్వడంతో పాటు ఆ విత్తనం యొక్క ఉపయోగం అలాగే దానిని సాగు చేసే విధానాన్ని కూడా తెలియజేసేది.

  ఆమె దాచిన చిరుధాన్యాల విత్తనాల పేర్లు మనలో ఎవరికీ కూడా తెలిసి ఉండవు. కోడో, కుటికి, సీకియా, సిల్హార్, సావా మరియు చెన…వంటి ఎవ్వరికీ తెలియని చిరుధాన్యాలు రకాల విత్తనాలు కూడా ఆవిడ వద్ద ఉన్నాయి. అంతరించిపోతూ ఉన్న 150 రకాల చిరుధాన్యాల విత్తనాలను ఆమె సేకరించి బీచ్ బ్యాంకులో దాచి పెట్టింది. అంతరించిపోతున్న విత్తనాలను తిరిగి రైతుల చేత సాగు చేయించేలా చేయడమే ఆమె యొక్క ప్రధాన ఉద్దేశం.

లహరిబాయి తన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులకు తన వద్ద ఉన్న అరుదైన విత్తనాలను పంపుతుంది ఆ రైతులు ఆ విత్తనాలతో వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండిస్తారు. అలా ఆ రైతులు పంటని పండించిన తరువాత ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఈమెకి బహుమానంగా ఇస్తారు. ఇలా ఈమె డబ్బు కోసం చేయడం లేదు.. విత్తనాలను సేకరించి వాటిని కాపాడడం కోసం చేస్తూ ఉంది. అలా సేకరించిన విత్తనాలను తిరిగి సాగు చేయడం కోసం పంచ పెడుతుంది.

  ఈమె తన వద్ద అరుదుగా దొరికే ధాన్యాలతో రకరకాల పానీయాలను అలాగే వంటలను కూడా తయారు చేస్తుంది. అరుదైన చిరుధాన్యాలతో తయారుచేసిన వంటలను తింటూ ఉన్నందుకే ఆమె ఇంకా చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చింది.

  ఆమె తన ఇంటిని బీజ్ బ్యాంకులా తయారు చేసింది. ఆమె ఇల్లు చాలా చిన్నది. ఆ ఇంట్లో కేవలం రెండే రెండు గదులు ఉంటాయి. ఆ ఇల్లు కూడా మట్టితో చేయబడిన ఇల్లు. ఒక గదిలో తన కుటుంబం నివసిస్తూ ఉంటుంది. అంటే లహరి మరియు తన తల్లిదండ్రులు ఒక గదిలో నివసిస్తూ ఉంటారు. ఆ గదిలోని వారు కిచెన్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అన్ని రకాల పండ్లు వారు ఆ గదిలోనే చేస్తారు. మరొక గదిని వారు పూర్తిగా విత్తనాలతో మరియు ధాన్యంతో నింపేస్తారు. ఆమె తన వస్తువుల కంటే విత్తనాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంది. లహరి ఆ విత్తనాలతో పాటు అడవి లో దొరికే ఉత్పత్తులను బజారులో అమ్ముతూ డబ్బులను సంపాదించుకుంటూ ఉంటుంది. ఇంత చేస్తున్న ఈవిడ వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.

 2023 జనవరి 26న డిండోరి లో  జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈమెను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు ఆ జిల్లా కలెక్టర్. ఆ కార్యక్రమంలో ఆమె తన బీజ్ బ్యాంక్ గురించి చాలా విషయాలు చెప్పారు. మొదట్లో ఆమె విత్తనాలను సేకరిస్తూ ఉన్నప్పుడు పూరి జనం అంతా ఆమెను చూసి నవ్వేవారని…అలా నవ్వుకున్న వారు నేడు ఆమెను చూసి అసూయ పడుతూ ఉండి ఉంటారని ఆమె చెప్పింది. ఆ రిపబ్లిక్ డే ఈవెంట్ తర్వాత ఆమెని ఎంతోమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేశారు. ప్రపంచానికి ఆమె గురించి తెలిసింది.


© 2023 - 2025 Millets News. All rights reserved.