చిరు ధాన్యాల రోటీ ఇలా చేశారు అంటే మస్త్ హెల్తీ

చిరు ధాన్యాల రోటీ ఇలా చేశారు అంటే మస్త్ హెల్తీ

చిరు ధాన్యాల రోటీ ఇలా చేశారు అంటే మస్త్ హెల్తీ

 

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివేకానీ,  ఏ రకంగా తీసుకోవాలి? ఇది తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాధారణంగా చిరుధాన్యాలలో రెండు రకాల ధాన్యాలు ఉంటాయి. ఒక రకంలో ఏమో ధాన్యాన్ని నేరుగా వండుతాము. మరొక రకంలో ఏమో ధాన్యాన్ని పిండి చేసి వాడతాం. కొర్రలు, ఆరికలు, ఊదలు, సాములు, అండు కొర్రలు ఇవన్నీ  నేరుగా వండే చిరుధాన్యాలు. రాగులు సజ్జలు జొన్నలు ఇవేమో ధాన్యాన్ని పిండి చేసి వాడుకునేవి. మొదటి రకం చిరుధాన్యాల నీ  సాధారణంగా అందరూ అన్నంగా వండుకుంటారు. రెండో రకం చిరుధాన్యాలను పిండి చేసి రొట్టెలుగా వాడుకుంటారు. చాలామంది ఈ రాగులు సజ్జలు, జొన్నలతో మాత్రమే రొట్టెలను తయారు చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ కొర్రలు ఆరికలు సాములు అండుకొర్రలు వంటి చిరుధాన్యాలతో కూడా రొట్టెలను (Millet Roti) తయారు చేసుకోవచ్చు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం. ఈ మొదటి రకం చిరుధాన్యాల నీ కేవలం అందంగా వండుకోవడం మాత్రమే కాకుండా రొట్టెలుగా కూడా తయారు చేసుకోవచ్చు. 


కొర్రలతో అండు కొర్రలతో సామలతో ఊదలతో రొట్టెలను (Millet Roti) తయారు చేసుకోవచ్చు అని వినగానే అందరికీ ఒక సందేహం కలుగుతుంది. పై చెప్పబడిన చిరుధాన్యాలలో జిగురు అనేది ఏ మాత్రం ఉండదు. అలాంటప్పుడు రొట్టె ఎలా తయారవుతుంది అని అనుకుంటూ ఉంటారు. నిజానికి జిగురు అనగా ఈ గ్లూటన్ ఏ రకరకాల వ్యాధులకు మూల కారణం. మనం సాధారణంగా తీసుకుని అన్ని రకాల ఆహార పదార్థాలలో ఈ గ్లూటెన్ లభిస్తుంది. కానీ చిరుధాన్యాలలో గ్లూటన్ అనేది ఉండదు. ఇవి గ్లూట్న్ ఫ్రీ ఆహారం. మరైతే వీటితో రొట్టెలు ఎలా తయారవుతాయి?.. తయారైన విరిగిపోతాయేమో? ఒకవేళ సరిగ్గా తయారు అయిన రుచిగా ఉండదేమో? వంటి సందేహాలు అందరికీ కలుగుతాయి. 

చిరు ధాన్యాల రోటీలను అసలు ఎలా తయారు చేసుకోవాలి 

సాధారణంగా చిరుధాన్యాలలో జిగురు చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రొట్టి సరిగ్గా తయారవ్వదు. అందుకే అందరూ గోధుమలతో తయారు చేసిన రొట్టెలను బాగా తీసుకుంటారు. అలాకాకుండా రాగులతో కానీ జొన్నలతో కానీ సజ్జలు తో కానీ రొట్టెలు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ కొర్రలు అరికెలు ఇలాంటి చిరుధాన్యాలతో రొట్టె చేయడం మరి కాస్త కష్టంగా ఉంటుంది. కానీ వీటిని ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. అలా అని ఎప్పుడూ ఒకే రకమైన ఆహారాన్ని తినలేము. 

 ముందుగా ఏదో ఒక చిరుధాన్యాన్ని పిండి చేసి పెట్టుకోవాలి. ఉదాహరణకు కొర్రలను తీసుకుందాం. కొరలను మెత్తటి పిండిగా చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మినుములను కూడా పిండి చేసుకోవాలి. ఈ మినుములు ఎందుకు అన్న సందేహం కలగవచ్చు. సాధారణంగా చిరుధాన్యాలలో జిగురు ఉండదు. కనుక జిగురు కలిగి ఉన్న ఈ మినుముల పిండిని వాడడం ద్వారా రొట్టె (Millet Roti) చక్కగా తయారవుతుంది. 

మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలను ట్రై చేయండి 


   విధానం :-1


   ఒక్క కప్పు మినుముల పిండికి దాదాపు మూడు కప్పుల కొర్రల పిండి తీసుకోవాలి. రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్క కప్పు నీరు తీసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరొక చిన్న కప్పులో కొంత నీటిని అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో  నుండి కొంత పిండిని తీసి కప్పులో ఉన్న నీటిలో వేసి స్లరి లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిండితో తయారుచేసిన ఈ స్లరీ ని మరుగుతున్న నీటిలో వేయాలి. ఒకసారి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నీరు పూర్తిగా కాగాలి. ఇప్పుడు ఈ కాగిన నీటిలో కలిపి పెట్టుకున్న మినుములు మరియు కొర్ల పిండిని వేసి ఒకసారి కలిపి సన్నని మంటలు మూత పెట్టుకోవాలి. అలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని దించుకోవాలి. వేడి మీదనే చేతికి కాస్త చల్లటి నీటిని రాసుకుంటూ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. మనం వేసిన మినుముల పిండి వలన పిండి ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండిని కొంత తీసుకొని చాలా మెల్లగా సున్నితంగా చపాతీలలో ఒత్తుకోవాలి. ఆపై వీటిని చపాతీలలానే కాల్చుకోవాలి.


ఈ రొట్టెలను మరొక విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. 

విధానం :-2

మనకు నచ్చిన చిరుధాన్యాన్ని మెత్తటి పిండిలా తయారు చేసుకోవాలి. ఈ రెండవ విధానంలో కేవలం ఒక్క ధాన్యం పిండి నే కాకుండా రెండు నుంచి మూడు రకాల ధాన్యాల పిండిని వాడుకో వచ్చు. ఉదాహరణకు డయాబెటిస్ తో బాధపడేవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారంలో కొర్రలు అలాగే రాగులు ప్రతిరోజు తీసుకోవాలి. కొర్రల పిండిని అలాగే రాగుల పిండిని రెండిటిని ఉపయోగించి రొట్టెలు  (Millet Roti) ఎలా తయారు చేసుకోవడం తెలుసుకుందాం. మనం కావాలంటే మనకు నచ్చిన ధాన్యాల పిండిని వాడుకోవచ్చు. ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు కోడల పిండి తీసుకోవాలి. ఇందుకు అరకప్పు మినుముల పిండి తీసుకోవాలి. ఈ ధాన్యాల యొక్క పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు…క్యారెట్ తురుము.. లేదా ఏదైనా సన్నగా తరిగిన ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూరలలో కూడా మనకు నచ్చి నాకు కూడా వాడుకోవచ్చు. క్యారెట్ కి బదులుగా సొరకాయ బీరకాయ క్యాబేజ్ లేదా బీట్రూట్ వాడుకోవచ్చు. నచ్చిన కూరగాయలు వేసుకున్న తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెంగా మీరు కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ పై ఒక ముద్ద పిండిని తీసుకొని వేళ్ళతో నీటిని అడ్డుకుంటూ రొట్టెలా వత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న రెట్టెను పెనుంపై వేసి బట్టర్ పేపర్ ను తీసేయాలి. ఈ రొట్టెను నూనె వేసి రెండు వైపులా కాల్చు కోవాలి. 

మొదటి విధానంలో చెప్పిన సాదా చపాతీలు నచ్చకపోతే ఇలా కూరగాయలు వేసి తయారుచేసిన రొట్టెలను తీసుకోవచ్చు. రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇకపై గోధుమలతో తయారు చేసిన రొట్టెలు (Millet Roti) కాకుండా చిరుధాన్యాలతో రొట్టెలను తయారు చేసుకొని తినడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.


© 2023 - 2024 Millets News. All rights reserved.