డయాబెటీస్ తగ్గడానికి చిరుధాన్యాల డైట్ చార్ట్ చూడండి

డయాబెటీస్ తగ్గడానికి చిరుధాన్యాల డైట్ చార్ట్ చూడండి

డయాబెటీస్ తగ్గడానికి చిరుధాన్యాల డైట్ చార్ట్ చూడండి

 

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని అందరికీ బాగా తెలుసు. నేడు మనకు చాలా రకాల చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. కొందరేమో కొర్రలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని అంటారు. మరికొందరు సామలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని చెబుతారు. మరికొందరైతే జొన్నలు రాగులు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని చెబుతూ ఉంటారు. నిజానికి అన్ని చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని చిరుధాన్యాలు కొన్ని ప్రత్యేకమైన వ్యాధులను సులభంగా తగ్గిస్తాయి. అన్ని రకాల చిరుధాన్యాలు చక్కెర వ్యాధిని తగ్గిస్తాయి. కానీ చాలామందికి చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఏ చిరుధాన్యాలను ( Millets for Diabetes) ఏ సమయంలో తీసుకోవాలి. ఉదయం ఎలాంటి చిరుధాన్యాన్ని తీసుకోవాలి? మధ్యాహ్నం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఇక సాయంత్రం సమయంలో ఎలాంటి చిరుధాన్యాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి అని రకరకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేయడం కోసం ఒక వారంలో అంటే ఏడు రోజులలో చిరుధాన్యాలను ఏ రకంగా తీసుకోవాలో తెలుసుకుందాం 

రాగులు ( Finger Millets)

                 చిరుధాన్యాలన్నీ చక్కెర వ్యాధిని (Diabetes) తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ అన్నిటికంటే రాగులు కాస్త ఎక్కువగా ఉపయోగపడతాయి. పూర్వం మన పెద్దలు అందరూ దాదాపు రాగి పిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునేవారు. అందుకే వారికి చక్కెర వ్యాధి ఉండేది కాదు. ఎప్పుడైతే కాలం మారి, పరిస్థితులు మారాయో అప్పటినుండే ఇలాంటి వ్యాధులు మొదలవుతూ ఉన్నాయి. అంటే రాగుల వాడకం తగ్గగానే ప్రజల్లో చక్కెర వ్యాధి (Diabetes) ఎక్కువగా వ్యాపించింది. రాగులలో పాలిఫెనాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆహారం జీర్ణం అవ్వగానే రక్తంలోకి ఒక్కసారిగా అధిక స్థాయిలో చక్కెరని విడుదల చేయకుండా ఈ పాలిఫెనాల్ అనే పదార్థం అడ్డుకుంటుంది. కాబట్టి ఈ పోలిఫెనాల్ అధికంగా ఉన్న రాగులు చక్కెర వ్యాధితో బాధపడే వారికి అమృతంలా పనిచేస్తాయి.

కావున చక్కర వ్యాధితో బాధపడేవారు వారంలో ప్రతిరోజు అనగా ఏడు రోజుల లో ఏదో ఒక పూట ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగి పిండితో చాలా రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు రాగి పిండిని ఏదో ఒక రకంగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పాలిఫెనాల్ కంటెంట్ శరీరంలో బాగా పెరుగుతుంది. కావున ఇవి డయాబెటిస్ (Diabetes) ని చాలా త్వరగా తగ్గిస్తుంది. అలాగే ఈ రాగులలో క్యాల్షియం అధికంగా లభిస్తుంది. చెక్కర వ్యాధితో బాధపడే వారిలో చాలామంది నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. క్యాల్షియం అధికంగా ఉన్న ఈ రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను కూడా అధిగమించవచ్చు.

కొర్రలు ( Foxtail Millets )

చక్కెర వ్యాధి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. హెరిడిటీ కూడా ఒక కారణం కావచ్చు…ఈ హెరిటిటీ కేవలం 30% మాత్రమే చెక్కర వ్యాధికి కారణం అవుతుంది. మిగిలిన 70% మనం తీసుకునే ఆహారం పై మాత్రమే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉండవచ్చు. అలాకాకుండా రుచికి అలవాటు పడి నచ్చిన ఆహారాన్ని నచ్చినట్టు తీసుకుంటూ ఉంటే ఆరోగ్య సమస్యలు రాక తప్పదు. మనం తీసుకునే ఆహారం మితంగా ఉండాలి.. కానీ అన్ని రకాల మినరల్స్ న్యూట్రియన్స్ కలిగి ఉండాలి. కానీ మనం ఎప్పుడూ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతాం. ఫైబర్ న్యూట్రియన్స్ మినరల్స్ వంటివి చాలా తక్కువగా తీసుకుంటాం. ఉదాహరణకు రైస్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రైస్ తో పాటు తీసుకుని వెజిటేబుల్ కర్రీస్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న రైస్ ని ఎక్కువగా తింటాం. ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ ఉన్న కర్రీస్ ని తక్కువగా తింటాం. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ న్యూట్రియన్స్ అలాగే ఫైబర్ పూర్తిగా తక్కువగా తీసుకుంటాం. ఇలా తీసుకోవడం ద్వారా ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని మన శరీరంలోకి వెళ్లి ఫ్యాట్స్ గా మారి బాగా స్టోర్ అవుతాయి. తిరిగి ఈ ఫ్యాట్స్  ఎనర్జీ గా కన్వర్ట్ కాకపోతే శరీరంలో ట్రై గ్లిసర్ ఆయిడ్స్ పెరుగుతాయి.మన శరీరంలో ఉండే అధిక కేలరీలు అన్ని ట్రై గ్లిజరైడ్స్ గా మారుతాయి. ఈ ట్రై గ్లిజరాయిడ్స్ లెవెల్ కనుక ఎక్కువ అయితే శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ద్వారా చక్కెర వ్యాధి వస్తుంది. కనుక చక్కెర వ్యాధితో బాధపడేవారు మన శరీరంలో కొవ్వుని అలాగే ట్రై గ్లీజర్ ఆయిడ్స్ యొక్క లెవెల్ ని తగ్గించే చిరుధాన్యాన్ని ఎన్నుకోవాలి. కొర్రలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ ట్రై గ్లసీరోయిడ్స్ యొక్క లెవెల్ ని కూడా పూర్తిగా తగ్గించి షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ద్వారా డయాబెటిస్ కూడా పూర్తిగా తగ్గుతుంది. కనుక చక్కెర వ్యాధితో (Diabetes) బాధపడేవారు రాగులతోపాటు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కొర్రలను  ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఈ రకంగా చూసుకుంటే వారంలో ఏడు రోజులలో ప్రతిరోజు రాగులని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కొర్రలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగులతో చాలా బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. రాగి చపాతి, రాగి ఇడ్లీ, రాగి దోస తయారు చేసుకోవచ్చు. ఇక కొర్రలతో ( Foxtail Millets )అయితే చాలా లంచ్ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఈ కొర్రలను అన్నం లానే వండుకోవచ్చు. ఇలా చూసుకుంటే రోజులో రెండు పూటలు ఎలాంటి చిరుధాన్యాన్ని తీసుకుంటే చక్కెర వ్యాధి తగ్గుతుందో తెలుసుకున్నాం. ఇక మూడవ పూట మీకు నచ్చిన చిరుధాన్యాన్ని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఎందుకంటే చిరుధాన్యాలు ( Millets for Diabetes) ఆరోగ్యానికి ఏదో ఒక రకంగా మేలు చేస్తాయి తప్పితే వాటి వల్ల ఎలాంటి కీడు ఉండదు. ఈ రకంగా చక్కెర వ్యాధితో బాధపడేవారు తమ మీల్స్ ని ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు.

 


© 2023 - 2024 Millets News. All rights reserved.