పిల్లలు చాలా త్వరగా అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు.. కేవలం కొద్దిసేపు పని చేసిన త్వరగా అలిసిపోతారు.. చర్మం త్వరగా పొడిబారిపోవడం…చిన్నవయసులోనే జుట్టు రాలిపోవడం…లేదా బడిలో చదువుకుంటూ ఉన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వంటి చాలా సమస్యలు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు మూడు పూటలా సరిగ్గా తినకపోవమే అసలు కారణమని అనుకుంటూ ఉంటాం. నిజానికి ఆహారం యొక్క క్వాంటిటీ పై ఆరోగ్యం ఆధారపడి ఉండదు.. ఆహారం యొక్క క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఆహారం తీసుకుంటూ ఉన్నాం అన్నది కాదు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నామన్నది మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.
ఒక సర్వే ప్రకారం తేలినది ఏమిటంటే పదిమందిలో ఎనిమిది మంది పిల్లలు క్యాల్షియం డివిషన్స్ తో ఇబ్బంది పడుతున్నారు. దీనినీ హైపోకాల్షిమియా అంటారు. శరీరంలో మరియు రక్తంలో కావాల్సిన దానికంటే చాలా తక్కువగా కాల్షియం కనుక్కో ఉంటే ఆ కండిషన్ ని హైపోకాల్షమియా అంటారు. ఈ వ్యాధి పిల్లల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో కనక కాల్షియం తక్కువ అయితే వారిలో ఎదుగుదల తగ్గిపోతుంది. నిజానికి శరీరం లోపల ఉన్న ఖండరాలు ఎముకలు గట్టి పడాలన్న అభివృద్ధి చెందాలి అన్న క్యాల్షియం చాలా అవసరం. శరీరంలో జరిగే పెరుగుదల సాధారణంగా చిన్న వయసులోనే ఎక్కువగా ఉంటుంది. అలాంటి చిన్న వయసులోనే కాల్షియం తక్కువ అయితే ఎదుగుదల ఆగిపోయి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ క్యాల్షియం లోపం కారణంగా డ్రై హెయిర్ మరియు డ్రై స్కిన్ సమస్యలు కూడా వస్తాయి.. చాలామంది పిల్లల వేళ్లకు ఉన్న గోర్లు మనం కట్ చేయకుండానే విరిగిపోతూ ఉంటాయి.. పిల్లల్లోనే కాదు ఈ సమస్య పెద్దల్లో కూడా ఉంటుంది.. ఇలా గోర్లలో శక్తి లేకపోవడం కూడా కాల్షియం డెఫిషియన్సీకి ఒక సూచకం. చిన్న వయసులో పిల్లలకు ఎక్కువ పంటి సమస్యలు ఉంటాయి. మనం చాక్లెట్లు తినడం ద్వారానే వారికి పంటి నొప్పి వచ్చింది అని అనుకుంటూ ఉంటాం.. చాక్లెట్లు కూడా ఒక కారణం కావచ్చు కానీ చాక్లెట్ మాత్రమే కారణం కాదు.. వారిలో క్యాల్షియం డెఫిషియన్సీ అధికంగా ఉండటం వల్లనే పంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా క్యాల్షియంకి సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేసుకోవాలి అంటే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ని ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.
క్యాల్షియం రిచ్ ఫుడ్ అనగా అందరికీ పాలు గుర్తుకు వస్తాయి నాలుగు నుండి 8 సంవత్సరాల వయసులో పిల్లలకు 1000 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం అవుతుంది. మనం పిల్లలకు 1000 గ్రాముల కాల్షియం నిజంగా అందిస్తూ ఉన్నామా..? ఒకసారి చెక్ చేసుకుందాం.. పిల్లలకు క్యాల్షియం అందాలి అంటే తప్పకుండా ఒక్క గ్లాస్ పాలు తాగించాలి అని అందరూ అంటూ ఉంటారు.. ఒక్క గ్లాస్ పాలలో కేవలం 300 మిల్లీగ్రాముల క్యాల్షియం మాత్రమే ఉంటుంది. అంటే మనం పిల్లలకు కేవలం ఒక గ్లాసు పాలు ద్వారా 300 మిల్లీగ్రామ్ల క్యాల్షియం మాత్రమే అందిస్తూ ఉన్నాం. మిగిలిన 700 మెల్లి గ్రాముల సంగతి ఏమిటి…? అదే 9 నుండి 13 సంవత్సరాల పిల్లలకు 1300 మిల్లీగ్రాముల క్యాల్షియం కావాల్సి ఉంటుంది.. వీరికి కూడా మనం ఒక గ్లాస్ పాలను మాత్రమే ఇస్తాం. మరి మిగిలిన వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం సంగతి ఏమిటి?
దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఇచ్చే ఒక్క గ్లాస్ పాలు వల్ల పిల్లలకు సరిపడా కాల్షియం అందడం లేదు. అంటే అదనంగా ఆహారం ద్వారా కాల్షియంని మనం అందించాల్సి ఉంటుంది. అదనంగా అందించాలి అంటే కాల్షియం సప్లిమెంట్స్ టాబ్లెట్స్ వాడకూడదు. తిన్నావా నుండి మినరల్ లేదా విటమిన్ సప్లిమెంట్ టాబ్లెట్స్ ని వాడడం ద్వారా ఒక వయసు వచ్చాక వారిలో అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువైపోతాయి. కనుక పిల్లలకు ఎలాంటి ఖనిజాలను ఎలాంటి విటమిన్ లను అందించాలి అన్న వాటిని ఆహారం ద్వారానే అందించాల్సి ఉంటుంది.
పిల్లలకు ప్రతిరోజు రాగులతో తయారుచేసిన ఆహార పదార్థాలను అందించడం ద్వారా వారిలో ఉన్న క్యాల్షియం లోపాన్ని తగ్గించవచ్చు. రాగులలో క్యాల్షియం అధికంగా లభిస్తుంది.. అన్ని చిరుధాన్యాలలో కంటే రాగులలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాములకు 344 మిల్లీ గ్రామీణ కాల్షియం లభిస్తుంది. అంటే ఒక కప్పు పాలక్ కంటే రాగుల ద్వారానే అధిక కాల్షియం లభిస్తుంది.
రాగులను ప్రతిరోజు పిల్లలకు ఆహారంగా ఇవ్వడం ద్వారా వారిలో ఎముకల శక్తి బాగా పెరుగుతుంది.. మజిల్స్ యొక్క పనితీరు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.. పళ్ళు కూడా గట్టిపడతాయి.. క్యాల్షియం అధికంగా ఉన్న ఈ రాగులను పిల్లలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనీమియా లాంటి సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. మనం సాధారణంగా పిల్లలకు పెట్టే ఆహారమైన బియ్యం మరియు గోధుమ పిండి కంటే ఈ రాగులు మరింత ఆరోగ్యాన్ని అందిస్తాయి. చిన్న వయసు నుండి పిల్లలకు రాగి కి సంబంధించిన ఆహారాన్ని అందించడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వీటితో పాటు సోయాబీన్స్ లో కూడా అధిక కాల్షియం ఉంటుంది, పాలకూరలో కూడా కాల్షియం అధికంగా లభిస్తుంది, బాదంపప్పులో కూడా అధికంగా కాల్షియం ఉంటుంది.సాల్మన్ ఫిష్ లో కాల్షియం అధికంగా ఉంటుంది
కనుక పిల్లలకు ప్రతో రోజు గ్లాస్ పాల తో పాటు ఎదైన ఒక పూట రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.ఈ రకంగా చూసుకుంటే పిల్లలకు దాదాపు 650 నుండి 700 మిలో గ్రాముల దాహ కాల్షియం లభిస్తుంది. వీటితోపాటు సోయాబీన్స్ లేదా సోయాబీన్స్ తో తయారు చేయబడిన మీల్ మేకర్, పాలకూర, బాదంపప్పు, సాల్మన్ ఫిష్ లాంటి వాటిని అందించడం ద్వారా కూడా పూర్తిగా పిల్లల శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.
© 2023 - 2025 Millets News. All rights reserved.