వ్యాధి తగ్గాలి అన్నా భవిష్యత్తులో వ్యాధులు రాకుండా ఉండాలి అని అనుకున్న చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి అని అందరూ చెబుతూ ఉంటారు. నేడు చాలా రకాలు చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఏ సమయంలో ఎలాంటి చిరుధాన్యాన్ని తీసుకోవాలి. అందులోనూ అధిక రక్తపోటు ఉన్నవారు ఎలాంటి చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
నేడు చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక రక్తపోటు సమస్య అనేది చాలా కామన్ సమస్యగా మారిపోయింది. ఈ అధిక రక్తపోటు సమస్య రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఆ కారణాలేమిటి వాటిని తగ్గించుకోవడానికి ఏ ఏ సమయాల్లో ఎలాంటి చిరుధాన్యాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం
ఒకప్పుడు మనిషి వృత్తికి నేడు మనిషి చేస్తూ ఉన్న వృత్తికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ప్రజలంతా కష్టపడి పని చేసేవారు. అంటే శారీరక కష్టం ఎక్కువ కలిగి ఉన్న పనిని చేసేవారు. పొలాలలో పనిచేయడం,కూలి పనిచేయడం, రాళ్లు మోయడం… ఇవన్నీ అధిక శారీరక శ్రమ కలిగిన పనులు. ఆ సమయంలో మనిషికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండేది కాదు. ఎప్పుడైతే మనిషి ఒకే చోట కూర్చొని పనిచేయడం ప్రారంభించాడో అప్పటినుండి ఆరోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి. శరీరంలో కదలిక లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కదలిక లేకపోయినప్పుడు ఏర్పడే మొదటి ఆరోగ్య సమస్య అధిక బరువు. అధిక బరువు అధిక రక్తపోటుని కలుగజేస్తోంది. అధిక రక్తపోటు కనుక తగ్గాలి అని అనుకుంటే ముందుగా అధిక బరువుని నియంత్రించుకోవాలి. ఒక్కో కేజీ తగ్గడం ద్వారా ఒక్కో పాయింట్ బిపిని తగ్గిస్తుంది. కనుక ముందుగా అధిక బరువుని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అధిక బరువుని నియంత్రించుకోవడానికి కొర్రలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైతే కొర్రలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటారు వారు సరైన బరువుని కలిగి ఉంటారు
గుండె ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. చాలామంది సన్నగా ఉంటారు.. సరైన బరువుని కలిగి ఉంటారు.. కానీ వారి గుండె ఆరోగ్యంగా ఉండదు. చాలామంది అధిక బరువు కలిగిన వారికి మాత్రమే అధిక రక్తపోటు ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అధిక బరువు ఉన్నవారికి మాత్రమే రోగాలు వస్తాయి అని కూడా అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. సరైన బరువు కలిగి ఉన్న వారికి కూడా అనారోగ్యాలు కలుగుతాయి. కేవలం మామూలు అనారోగ్యాలు మాత్రమే కాదు ఇలాంటి గుండె సంబంధిత రోగాలు కూడా వస్తాయి. చాలా సన్నగా ఉన్న వారిలో కూడా ఫ్యాట్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. చాలా లావుగా ఉన్న వారిలో కూడా కొన్ని కొన్ని సార్లు ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క బిఎంఐ ( బాడీ మాస్ ఇండెక్స్) సరైన స్థాయిలో ఉంది అని అనుకుందాం. అయినా ఆ వ్యక్తి అధిక జంక్ ఫుడ్ తినడం లేదా ఆల్కహాల్ కి అలవాటు పడటం వంటి అలవాట్లు ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో కూడా అన్ హెల్తి ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఈ ఫ్యాట్ అనేది శరీరంలోని అంతర్గత అవయవాలపై ఏర్పడుతుంది. ఇలా అంతర్గత అవయవాలపై ఏర్పడే ఫాట్ ని విసెరల్ ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ లివర్ చుట్టూ ఉండవచ్చు లేదా గుండె నాళాలలో కూడా ఉండవచ్చు. కనుక సన్నగా ఉన్న వారైనా సరే తమ గుండె ఆరోగ్యం ఎలా ఉందో సంవత్సరానికి ఒక్కసారైనా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ఇలాంటివి. ఇలాంటి విసరల్ ఫ్యాట్ ని తగ్గించుకోవాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో మెట్టబోలిజం ని పెంపొందిస్తుంది.తద్వారా శరీరంలో లోపల అవయవాల చుట్టూ పేర్కొన్న కొవ్వు నీ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
మాంసాహారులైతే చేపలను తీసుకోవడం ద్వారా వారి శరీరానికి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ అసిడ్స్ లభిస్తాయి. కానీ చేపలను శాఖాహారులు తీసుకోలేరు. అలాంటివారు సజ్జలను కనుక ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన ఒమేగా త్రీ ఆసిడ్స్ లభిస్తాయి. కేవలం ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మాత్రమే కాదు కాల్షియం ప్రోటీన్ ఐరన్ ఫైబర్ మెగ్నీషియం తయామన్ రైబోఫ్లెవెన్ వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పూర్తిగా లభిస్తాయి.
కనుక గుండె నాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని అలాగే శరీరంలో అవయవాలు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే తప్పకుండా సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా ఈ కొవ్వు కరిగితే తప్పితే అధిక రక్తపోటు అదుపులోకి రాదు.
డయాబెటిస్ మరియు హై బ్లడ్ ప్రెషర్ ఇవి రెండు తోడుదొంగలు లాంటివి. ఒక్క వ్యాధి వస్తే కచ్చితంగా మరొకటి వస్తుంది. ఏది వచ్చిన చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ లెవెల్స్ ని ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి. లేకపోతే శరీరంలో రోగాల సంఖ్య పెరిగిపోతాయి. రాగులను అధికంగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ తగ్గుతుంది. డయాబెటిస్ తగ్గడం ద్వారా శరీరంలో మరెక్కడైన వ్యాధి ఉంటే అది కూడా పూర్తిగా తగ్గుతుంది.
కనుక హై బ్లడ్ ప్రెషర్ నీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకున్న వారు తప్పకుండా మూడు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అవే కొర్రలు, సజ్జలు, రాగులు.
ఈ రకంగా చూసుకుంటే ఉదయం రాగులతో ఏదైనా టిఫిన్ నీ వండుకోవచ్చు. కొర్రలతో మధ్యాహ్నం లంచ్ నీ ప్లాన్ చేసుకోవచ్చు. కొర్రలతో అన్నం లేదా కోడల కిచిడి వంటివి తయారు చేసుకోవచ్చు. ఇక సజ్జలతో రాత్రి సమయంలో రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక రోజులో ఈ మూడు మిల్లెట్స్ ని తీసుకోవడం ద్వారా హై బ్లడ్ ప్రెషర్ పూర్తిగా తగ్గుతుంది.
© 2023 - 2025 Millets News. All rights reserved.