PCOD , PCOS సమస్యలు తగ్గాలి అంటే ఈ మిల్లెట్స్ తీసుకోవాలి

PCOD , PCOS సమస్యలు తగ్గాలి అంటే ఈ మిల్లెట్స్ తీసుకోవాలి

PCOD , PCOS సమస్యలు తగ్గాలి అంటే ఈ మిల్లెట్స్ తీసుకోవాలి

స్త్రీలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోను  పిసిఒడి మరియు పిసిఒఎస్ లాంటివి ఎక్కువ గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలామంది స్త్రీలు తాము ఇలాంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నామని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరైతే వారికి ఇలాంటి వ్యాధి ఉంది అని కూడా వారికి తెలిసి ఉండదు. చాలామంది పీసీఓడీ మరియు పిసిఒఎస్ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. ఇవి రెండూ గర్భాసయానికి సంబంధించిన వ్యాధులే అయినప్పటికీ రెండు వేరు వేరు.

పిసిఒడి అంటే పాలీ సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ , ఇక పిసిఒఎస్ అంటే పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇవి రెండూ పూర్తిగా వేరు వేరు. కానీ చాలామంది ఇవి రెండు ఒక్కటే అన్న భావనతో ఉంటారు. మనదేశంలో ప్రతి పదిమందిలో ఇద్దరు స్త్రీలు పిసిఒడి లేదా పిసిఒఎస్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

 పీసీఓడీ  అంటే ఏమిటి?

 అండాశయం నుండి అండం విడుదల కాకపోతే నెలసరి రాదు. అండాశయంలో అండం నిల్వ ఉండడంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. ఇలా బుడగలు ఏర్పడటాన్ని పిసిఒడిగా (PCOD ) చెబుతాం. ఇలా బుడగలు ఏర్పడడం ద్వారా అండాశయం యొక్క విస్తరణ బాగా పెరిగిపోతుంది. అలాగే పురుష హార్మోన్లు కూడా విడుదలవ్వడం మొదలవుతుంది. ఈ పీసీఓడీ కారణంగా సరైన సమయానికి నెలసరి రాకపోవడం.. అధిక బరువు పెరగడం, అవాంఛిత రోమాలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

పిసిఓఎస్ అంటే ఏమిటి?

 పిసిఓఎస్ అంటే శరీరంలో పురుష హార్మోన్లైన టెస్టోస్టిరాన్  లేదా ఆండ్రోజన్ లాంటి హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం కారణంగా హార్మోన్ యొక్క బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ హార్మోన్ ఇన్ బాలన్స్ కారణంగా ఈ పి సి ఓ ఎస్ (PCOS)  ప్రాబ్లం వస్తుంది. ఈ అందాశయాలు అధిక స్థాయిలో ఆండ్రోజన్ హార్మోన్ నీ వీడియోల చేయడం ద్వారా అండం విడుదలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఇవన్నీ అండాశయం లో  పెరుకుపోతాయి. దీనివల్ల బరువు పెరగడం, నెలసరి క్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంచిత రోమాలు మరియు మానసిక ఒత్తిడి ఏర్పడుతాయి.

ఎలాంటి ఆహరం తీసుకోకూడదు?

ఈ పిసిఒడి మరియు పిసిఒఎస్ కి ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారం. మన బామ్మలకు మరియు మన అమ్మమ్మలకు ఇలాంటి వ్యాధి అనేది ఉండేది కాదు. దానికి కారణం వారు తీసుకునే బలమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం. కానీ ప్రస్తుతం పిల్లల నుండి పెద్దల వరకు అందరూ జంక్ ఫుడ్ కి బాగా అలవాటూ పడిపోతున్నారు. అందులోనూ బేకరీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారానే ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈస్ట్ వేసి తయారు చేయబడిన పదార్థాలు అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే క్రీములు వాడీ పేస్ట్ లను తయారు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం బరువుని పెంచడం మాత్రమే కాకుండా హార్మోన్ల బ్యాలెన్స్ ని కూడా తప్పిస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయో అప్పుడే ఈ పీసీఓడీ లేదా పీసిఓఎస్ ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకప్పుడు నీరసం వేస్తే పండ్ల రసాలు తీసుకునేవారు కానీ ప్రస్తుతం నీరసం వేస్తే ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు.. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఆపేంతవరకు ఆరోగ్యం అన్నది బాగుపడదు.

ఎలాంటి ఆహరం తీసుకోవాలి?

ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు చూశాం. ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ పిసిఒడి మరియు పిసిఒఎస్ లాంటి ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చో చూద్దాం.

ఈ పిసిఒడి లేదా పి సి ఓ ఎస్ ని తగ్గించుకోవాలి అంటే ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. చిరుధాన్యాల ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే త్వరగా తగ్గించుకోవచ్చు. కొన్ని పీసీఓడీ అండ్ పీసీఓఎస్ ఫ్రెండ్లీ మిల్లెట్స్ (PCOD and PCOS friendly Millets) కూడా ఉన్నాయి. చిరుధాన్యాలలో ఏవైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయో అలాంటి చిరుధాన్యాలు పిసిఒడి మరియు పిసిఒఎస్ కి కూడా బాగా పనిచేస్తాయి. ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క చిరుధాన్యం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. కనుక అన్ని చిరుధాన్యాలు వాడటం ద్వారా స్త్రీ శరీరంలో రుగ్మతలు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే రాగులను అధికంగా తీసుకోవడం ద్వారా కాల్షియం లభిస్తుంది.. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. ఎప్పుడైతే అధిక బరువు తగ్గుతామో అప్పుడు అండాశయానికి లేదా గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి.

కొర్రలు ను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పిసిఒడి మరియు పిసిఒఎస్ ప్రాబ్లం ని దూరం చేసుకోవచ్చు. హై గ్లైకామిక్ ఇంటెక్స్ ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం ద్వారానే ఇలాంటి పిసిఒడి లేదా పి సి ఓ ఎస్ ప్రాబ్లమ్స్ (PCOS) ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ కోరలలో లో గ్లైకామిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ లో గ్లైకామిక్ ఇండెక్స్ ఉండటం కారణంగా శరీరంలోకి చక్కగా చాలా మెల్లగా విడుదలవుతుంది. ఎప్పుడైతే ఇలా మెల్లగా విడుదలవుతుందో శరీరంలో చెక్కర స్థాయి పెరగకుండా ఉంటుంది. తద్వారా అనేక రకాల వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. పి సి ఓ డి లేదా పి సి ఓ ఎస్ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవాలి అంటే రక్తంలోకి చక్కెర త్వరగా విడుదలయ్యే పదార్థాలు కాకుండా చాలా ఆలస్యంగా విడుదల చేసి ఇలాంటి చిరుధాన్యాలను తీసుకోవాల్సి ఉంటుంది.

జొన్నలను అలాగే సజ్జలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు

 


© 2023 - 2025 Millets News. All rights reserved.