ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ సొంత నియోజకవర్గం అయిన కాంటాబాంజీ లో పత్తి రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే చాలా సంవత్సరాలుగా వారు పత్తి పంటను సాగు చేయడం వలన దిగుబడి తగ్గుతూ ఉంది. దీంతో ఆ నియోజకవర్గంలో 20 శాతం రైతులు పత్తి పంటకు బదులుగా చిరుధాన్యాలను (Millets) పండిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మిల్లెట్స్ సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహకాలు అందించడంతో ఈ రైతులు చిరుధాన్యాలు పండించడానికి నిర్ణయించుకున్నారు.
ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం కూడా చిరుధాన్యాలను పండించే రైతులకు 4వేల రూపాయలు సహాయం చేస్తున్నట్టు ఒక రైతు వెల్లడించారు. అయితే ప్రస్తుతం కేవలం రాగులకు మాత్రమే మార్కెట్ అధికంగా ఉంది అని మిగతా మిల్లెట్స్ ను అమ్మడానికి రైతు ఉత్పత్తి కేంద్రాలు లేదా మధ్యవర్తుల ద్వారా మాత్రమే అమ్మకం కొనసాగుతుంది . మధ్యవర్తుల ద్వారా ఈ మిల్లెట్స్ ను అమ్మడం వలన రైతుకు ఆశించిన ధర రావడం లేదు దీనిపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని అక్కడే రైతులు కోరారు. అంతేకాకుండా చాలా కాలంగా పత్తిని సాగు చేయడం వలన అక్కడి భూమిలో పోషక విలువలు తగ్గిపోయాయి ఇప్పుడు మిల్లెట్స్ కు ( Millets Cultivation) మారడం వలన తిరిగి భూమి సారవంతం అవుతుంది అని వారు భావిస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు చిరుధాన్యాల్లో పండించడానికి వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుంది. అంతేకాకుండా మిగతా పంటల కంటే మిల్లెట్స్ ఏ వాతావరణం అయినా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది , దీనితోపాటు మిల్లెట్స్ పంట త్వరగా చేతికి అందుతుంది అందువలన మిల్లెట్స్ పంటను పండించడానికి నిర్ణయం తీసుకున్నామని అక్కడికి రైతులు అన్నారు.
Bill Gates : అప్పుడు హంగ్రీ రైస్, ఇప్పుడు సూపర్ ఫుడ్. మిల్లెట్స్ ను కొనియాడిన బిల్ గేట్స్
© 2023 - 2024 Millets News. All rights reserved.