ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, మిల్లెట్స్ ని చేర్చుకోవడం మొదలుపెట్టారు. మిల్లెట్స్ (Millets) వలన కలిగే ఉపయోగాలు ఇన్ని అన్ని కావు. మిల్లెట్స్ పై అవగాహన కల్పించడానికి కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ని కూడా పలు సంస్థలు నిర్వహిస్తున్నాయి.
తాజాగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (CIFT), సైన్స్ హెరిటేజ్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కింద డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక సహకారంతో ఒక ప్రోగ్రాం ని నిర్వహించింది. చేపల ప్రొటీన్, మిల్లెట్స్ ఆధారిత రెడీ-టు-ఈట్ స్మార్ట్ ఫంక్షనల్ ఫుడ్‌పై ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టారు.
రెడీ-టు-ఈట్ స్మార్ట్ ఫంక్షనల్ ఫుడ్‌లను అభివృద్ధి చేయడానికి మూడేళ్ళ నుండీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మిల్లెట్స్ పోషక ప్రయోజనాలను చేపల ప్రోటీన్, లిపిడ్ యొక్క గొప్పతనాన్ని కూడా ఇది కూడి వుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ వలన స్థానిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడమే కాక ఆహార భద్రతను పెంపొందించడం, మిల్లెట్స్ ని ప్రోత్సహించడం కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా కేరళ ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయి.
మిల్లెట్స్ లో వుండే పోషకాలను ఆహారపదార్దాల్లో అందించాలని పలు ప్రోడక్ట్స్ ని అందించారు. మిల్లెట్స్, చేపలతో (millets, fish-based products) ఈ ఏడాది మొదట్లో అనేక ఆహారపదార్దాలను తీసుకు వచ్చారు. గ్లూటెన్-ఫ్రీ కుక్కీస్, ఫిష్‌మి సాసేజ్‌లు, మిల్లెట్ ఆధారిత పిండ్లు, కొల్లాజెన్ పెప్టైడ్‌తో ఫోర్టిఫై చేసిన మిల్లెట్ మఫిన్ వంటివి ఉన్నాయి.
సిఐఎఫ్‌టిలోని ఫిష్ ప్రాసెసింగ్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు జె. బిందు, రెమ్య ఎస్, ఎళవరసన్ కె, సి.ఓ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పి.విజి మరియు సారిక కె. CIFT నుండి ఉత్పత్తులు తీసుకు వచ్చారు. మిల్లెట్స్ ఆధారిత ఆహార పదార్థాలకు ఫిష్ ప్రొటీన్ ఉండడం వలన పోషక విలువలు పెరుగుతాయి. చేపలు లో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అవసరమైన ఖనిజాల ఉంటాయి. ఈ ఆహార ఉత్పత్తులను అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.