సూపర్ ఫుడ్ గా పిలువబడుతున్న ‘‘మిల్లెట్స్’’ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరుగుతుంది. పేరుకు చిరుధాన్యాలు కానీ వాటిలో ఆరోగ్యానికి మేలు కలిగించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు యాభై కోట్ల మందికి పైగా మిల్లెట్స్ ను సంప్రదాయ ఆహారంగా భావిస్తారని తెలుస్తోంది. ఇక మన భారతదేశంలో రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగెలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అవిసెలు మరియు అండు కొర్రల వంటి ధాన్యాలను ఎక్కువగా సాగు అవుతున్నాయి.
మనం ఇప్పుడు ఆహారంగా తింటున్న గోధుమలు, బియ్యంతో పోలిస్తే.. మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మరియు విటమిన్లు అధికంగా ఉంటాయి. అదేవిధంగా చాలా రకాల మిల్లెట్స్ లో పది శాతం ప్రోటీన్ తో పాటు 3.5 శాతం లిపిడ్స్ ఉంటాయి.
మిల్లెల్స్ పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వాటితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ రైతులను ఆకర్షించడంలో మాత్రం చిరుధాన్యాలు విఫలం అయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో మిల్లెట్స్ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం చిరుధాన్యాల పంటను సరైన మద్ధతు ధరకు విక్రయించలేకపోవడమే. ఈ మేరకు తాజాగా వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ వారం వరకు మినుము సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే 80 శాతం తక్కువగా ఉంది. అంటే కేవలం 17 లక్షల హెక్టార్లు మాత్రమే.
ముతక ధాన్యాల (మినుములు) ఎంఎస్పీ గణనీయం పెరిగినప్పటికీ.. మద్ధతు ధరకు పంటలను విక్రయించలేకపోయారు. అయితే రైతులు పప్పుధాన్యాలైన తురుము, నూనెగింజల పంటల్లో సోయాబీన్ ను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పప్పు ధాన్యాలు 36.81 లక్షల హెక్టార్లలో సాగవగా... గత సంవత్సరం ఇదే కాలంలో 23.78 లక్షల హెక్టార్లలో సాగైంది. ఇక గత ఏడాది 4.09 లక్షల హెక్టార్లలో సాగైన తుర్రు.. దాదాపు నాలుగు రెట్లు పెరిగి సుమారు 20.82 లక్షల హెక్టార్లకు చేరుకుందని వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలలో పేర్కొంది.
సోయాబీన్ కూడా ఇదే తరహాలో గణనీయమైన పురోగతిని సాధించింది. గత సంవత్సరం ఈ వారం వరకు సుమారు 28.86 లక్షల హెక్టార్లలో సాగైన సోయాబీన్.. రెట్టింపు పెరుగుదలతో 60.63 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అలాగే సోయాబీన్ ఎంఎస్పీ ఆరు శాతం పెరిగి రూ.4,892 కు చేరుకుంది. కాలక్రమేణా... సాగు విస్తీర్ణం పెరుగుదలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.