ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ (Millets) మీద ధ్యాస పెట్టారు. మిల్లెట్స్ ని ఆహారంలో చేర్చుకుంటున్నారు. మిల్లెట్స్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా రకాల సమస్యల్ని మిల్లెట్స్ దూరం చేయగలవు. పంట చేతికి వచ్చే వరకు కూడా రైతులు ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా ఒకసారి అనుకున్నంతగా పంట చేతికే రాదు. చాలామంది రైతులు నష్టపోతుంటారు. ఈరోజుల్లో మోడ్రన్ అగ్రికల్చర్ వ్యవసాయంలో ఎంతో మార్పులు తీసుకువచ్చింది. మిల్లెట్స్ ని పండించే రైతులకి కలుపు మొక్కలు (Weeds) పెద్ద ఛాలెంజింగ్ అయిపోతుంటాయి. అయితే ఈ కలుపు మొక్కల్ని పట్టించుకోకుండా అలానే వదిలేసినట్లయితే పంట దిగుబడి మీద పెద్ద ప్రభావం పడుతుంది.
వ్యవసాయ నిపుణుడు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గహలవుట్ (PS Gahlaut) మిల్లెట్స్ అలానే కలుపు మొక్కలకి సంబంధించి ముఖ్యమైన విషయాలని పంచుకున్నారు. కలుపు మొక్కలను ఎదుర్కొనడానికి మిల్లెట్ పంట దిగుబడిని అప్టమైజ్ చేయడానికి సమర్థవంతమైన వ్యూహాలని ఈయన పంచుకున్నారు. మిల్లెట్స్ ప్రొడక్షన్లో కలుపు మొక్కలను ఎలా నివారించొచ్చు అనేది చెప్పారు. టెక్నాలజీతో ఈ సమస్యని పరిష్కరించవచ్చు అని అన్నారు.
సాంకేతిక వ్యవసాయంతో మిల్లెట్స్ పంటని పండించవచ్చు అని అన్నారు. ఇందుకోసం బహుముఖ విధానం అవసరమని అన్నారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కలుపు మొక్కలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, సాంస్కృతిక, యాంత్రిక, జీవ అలానే రసాయన నియంత్రణ పద్ధతులు బాగా పని చేస్తాయని అన్నారు.
క్రాప్ రొటేషన్, సరైన ప్లాంటింగ్ డెన్సిటీ, టైమ్లీ కల్టివేషన్ మిల్లెట్స్ ని పండించేటప్పుడు కచ్చితంగా పాటించాలని అన్నారు. మాన్యువల్ వీడింగ్ హోయింగ్, మెకానికల్ కల్టివేషన్ తో ఆర్గానిక్ మిల్లెట్ ఫార్మింగ్ చేసేటప్పుడు పాటిస్తే మంచిదని అన్నారు. ఇలాంటి టెక్నిక్స్ ని పాటించడం వలన కేవలం కలుపు మొక్కల్ని తొలగించడమే కాకుండా మట్టిలో పోషకాలు ఉంటాయని మిల్లెట్స్ ఎదుగుదల బాగుంటుందని అన్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.