చిరుధాన్యాలు (మిల్లెట్స్) గురించి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే కొచ్చిలో ఈ నెల 20 మరియు 21 తేదీలలో రెండు రోజుల పాటు మిల్లెట్స్ మరియు వాటి ప్రాముఖ్యాన్ని వివరిస్తూ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా ప్రజలు తమ రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకునే విధంగా కార్యక్రమ నిర్వహాకులు ప్రేరేపించారు.
దాదాపు రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిల్లెట్స్ ప్రాముఖ్యత, వంటల వర్క్ షాప్, లైవ్ క్విజ్, సలాడ్ బార్, మిక్సర్ ఈవెంట్ మరియు కమ్యూనిటీ పాట్ లక్ లను జరుపుకుంది. ఇది చిరుధాన్యాలను మనకు మరింత చేరువ చేసేందుకు విశేష కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ముంబై, భువనేశ్వర్, ఢిల్లీతో పాటు షిల్లాంగ్ లలో ఇటువంటి మిల్లెట్ కార్యక్రమాలను లోకావోర్ మరియు రెయిన్ మాటర్ ఫౌండేషన్ నిర్వహించాయి. చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేయడంతో పాటు వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. దాంతోపాటుగా ప్రజలు తమ రోజూవారీ ఆహారంలో మిల్లెట్లను చేర్చుకోవాలని సూచించారు.
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ నివేదిక వచ్చింది. దీని ప్రకారం.. 2021-22 సంవత్సరంలో మన భారతదేశంలో మిల్లెట్ ఉత్పత్తిలో కేరళ 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రజలలో మిల్లెట్స్ పై ఆసక్తి పెరిగింది. దీంతో చిరుధాన్యాలను ప్రతి ఒక్కరూ ఆహార ఎంపికగా చేసుకునే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించిందన్న సంగతి తెలిసిందే. కాగా... కేరళలోని ఆహార సంస్కృతిలో మిల్లెట్లు భాగం అయినప్పటికీ.. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ వాటి వినియోగం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాము మిల్లెట్స్ ను తిరిగి ఆహారంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని 'ది లోకావోర్ 'వ్యవస్థాపకులు చెఫ్ థామస్ జాక్ వెల్లడించారు.
జూలై 20న చిత్తూరు రోడ్డులోని ఫ్రెంచ్ టోస్ట్ లో ' మింగిల్ విత్ మిల్టెట్స్ ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక 21న యాచ్ క్లబ్ లో సాయంత్రం మిల్లెట్ మిక్సర్ అనే పేరుతో కార్యక్రమం జరిగింది. అయితే గత ఏడాదిన్నర కాలంగా నైతిక ఆహార పద్ధతులతో పాటు మంచి ఆహారాన్ని ప్రోత్సహించే కమ్యూనిటీ ది లోకావోర్ మరియు రెయిన్ మాటర్ ఫౌండేషన్ మిల్లెట్ పునరుద్ధరణ ప్రాజెక్టులో విశేష కృషి చేస్తున్నాయి. పునరుజ్జీవన ప్రాజెక్ట్ మిల్లెట్ల గురించి సమగ్ర అవగాహనను కల్పించడమే లక్ష్యంగా పని చేసాయి. మనం మిల్లెట్స్ ను ఎలా తింటాము? వాటిని ఎక్కడ సాగు చేస్తారు?, ఎవరు పండిస్తారు? అనే పలు రకాల అంశాలను ఈవెంట్ ల ద్వారా తెలిపే ప్రయత్నం చేశామని థామస్ జాక్ తెలిపారు.
అయితే, ఈ కార్యక్రమం మొదటి భాగమైన ‘మిల్లెట్ విత్ మిల్లెట్’ లో వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో సాంప్రదాయ మరియు ఆధునిక పద్ధతులను మిళితం చేస్తూ కొత్త వంటకాలను నేర్పించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుస్థిర అభివృద్ధి మరియు చిరుధాన్యాల ప్రాజెక్టులలో జోక్యాలపై ప్యానెల్ చర్చ జరిగింది. ఇక రెండవ ఈవెంట్ .. మిల్లెట్ మిక్సర్, మిల్లెట్ - థీమ్ క్విజ్, ఇంటరాక్టివ్ మిల్లెట్ సలాడ్ బార్ మరియు లోకావోర్ షఫుల్ తో చేపట్టారు. స్థానిక ఆహార బ్రాండ్ లు, హోమ్ చెఫ్ లు, రెస్టారెంట్లు మరియు ప్రొఫెషనల్ చెఫ్ ల నుండి మిల్లెట్ ఆధారిక వంటల శాంపిల్స్ ను అందించారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.