మనమంతా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినాలి అని అనుకుంటాం. కానీ ఈ సూపర్ మార్కెట్ కి వెళ్లిన ఏ దుకాణంలో చూసిన మైదా నూనె చెక్కర కొన్ని ఆసిడ్ రెగ్యులేటర్స్ లాంటి పదార్థాలను వాడి ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినాలి అని అనుకున్న అవి అందుబాటులో ఉండవు.
చత్తీస్గడ్ రాష్ట్రం లో జష్పూర్ అనే ఊరి లో నీ ఒక సంస్థ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలి అని నిర్ణయించుకుంది.చిరుధాన్యాలు తో చేసిన ఎనర్జీ బార్స్,అలాగే ఈ మధ్య బాగా పాపులర్ అయిన బక్ వీట్ తో పాస్త నీ తయారు చేస్తూ ఉన్నారు. బక్ వీట్ అనేది ఒక రకమైన గోధుమ, సాధారణ గోధుమల కన్నా ఈ గోధుమలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి కూడా మిల్లెట్ లో భాగమే. అలాగే “మహూవ” తో లడ్డు ( Mahua Ladoo) లను కూడా తయారు చేస్తూ ఉన్నారు.ఈ మహువ అంటే మరి ఏమిటో కాదు, దీనినే తెలుగు లో ఇప్ప అని అంటారు,ఇప్ప చెట్టు నుండి వచ్చే పువ్వులను అలాగే ఆ చెట్టు కి సంబంధించిన పదార్థాలు సాధారణంగా చాలా తీయగా ఉంటాయి. వీటిని గిరిజనులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ తీయనైన పదార్థాలను వాడి లడ్డూలను కూడా తయారు చేస్తూ ఉన్నారు.
మిల్లెట్స్ సూపర్ ఫుడ్ అని మనదేశం ప్రపంచానికి చాటి చెప్పింది : నరేంద్ర మోడీ
జష్పూర్ లోని తమకు దగ్గరలో ఉన్న అడవులలో నివసించే గిరిజనుల వద్ద ఈ ఆహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని తెలుసుకొని అందుకు కొంత ఆధునిక విజ్ఞానాన్ని చేర్చి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు. వీరికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంది.ఆ సంస్థ కు జాష్ ప్యూర్ (Jash Pure) అనే పేరు నీ కూడా పెట్టుకున్నారు.ఈ పదార్థాలు ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు దుకాణాలలో లభ్యమవుతూ ఉన్నాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రీనియర్ షిప్ మేనేజ్మెంట్(NIFTEM) చిరుధాన్యాలతో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి అయిదు ఏళ్ల క్రితమే రెండు పద్ధతులను ప్రవేశపెట్టింది.
జాష్ ప్యూర్ సంస్థ తమ పదార్థాలను కేవలం ఈ దేశంలోనే కాకుండా సింగపూర్, బెల్జియం, జర్మనీ లాంటి దేశాలలో కూడా అమ్మాలి అని అనుకుంటున్నారు. ఈ సంస్థ తాను తయారు చేస్తూ ఉన్న ఆహార పదార్థాల యొక్క శాంపిల్ లను విదేశాలకు పంపడం జరిగిందని, ఆ దేశం యొక్క అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామని జష్పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ రవి మిట్టల్ తెలిపారు. అలాగే ఈ సంస్థ ద్వారా ఆడవారు తమ కాళ్లపై తాము నిలబడగలరని, అలాగే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పోషకాహార లోపాన్ని కూడా దూరం చేయవచ్చని ఆయన తెలిపారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.