మిల్లెట్ ఉద్యమం.. మళ్లీ ఊపందుకుంటున్న పురాతన ధాన్యం

మిల్లెట్ ఉద్యమం.. మళ్లీ ఊపందుకుంటున్న పురాతన ధాన్యం

మిల్లెట్ ఉద్యమం.. మళ్లీ ఊపందుకుంటున్న పురాతన ధాన్యం

 

పురాతన ధాన్యంగా పిలువబడుతున్న ‘‘మిల్లెట్స్’’ పై రోజు రోజుకు ప్రజలలో అవగాహన పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాల నేపథ్యంలో ‘మిల్లెట్ ఉద్యమం’ జోరందుకుంది. దీంతో కొత్త తరానికి చెందిన ఆహార ప్రియులు చిరుధాన్యాలపై అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అవోకాడో టోస్ట్, బర్గర్ లను ఆస్వాదిస్తున్న ప్రస్తుత కాలంలో మిల్లెట్స్ వంటి ధాన్యాలు దశాబ్దం తరువాత తిరిగి ప్రాచుర్యంలోకి వస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న మిల్లెట్స్ మరుగున పడిపోయాయి. అయితే తాజాగా చిరుధాన్యాలు మళ్లీ ప్రాచుర్యంలోకి రావడంతో వాటి స్థానం తిరిగి సంపాదించుకున్నాయని చెప్పుకోవచ్చు. దశాబ్దం తరువాత మిల్లెట్ ఉద్యమం తిరిగి పుంజుకోవడానికి గల కారణాలను క్రాఫ్ట్ అండ్ ఫుడ్ 2.0 వ్యవస్థాపకులు వెల్లడించారు.

ఆరోగ్యంలో కీలక పాత్ర...

మిల్లెట్స్ లో పోషక పదార్థాలు మెండుగా ఉన్నాయి. చిరుధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు ఇవి గ్లూటెన్ ఫ్రీ కూడా. మంచి ఆరోగ్యం కావాలనుకునే వారికి మిల్లెట్స్ మంచి ఎంపిక. 

భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూలం..

చిరుధాన్యాలు (మిల్లెట్స్) ను సాగు చేయడం సులభం. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో పాటు తక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లోనూ మిల్లెట్స్ ను పండించవచ్చు. సరైన వనరులు లేనప్పటికీ ఎటువంటి రసాయనాలు వినియోంచకుండా వీటిని సాగు చేయవచ్చు. 

ప్రస్తుతం మిలీనియల్స్ విభిన్న సంస్కృతులతో పాటు అనేక రకాల వంటకాలను తెలుసుకోవడంపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రుచులను కోరుకుంటున్నారు. అలాగే సాంప్రదాయ వంటల్లో ప్రధానమైన మిల్లెట్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుంటున్నారు. మిల్లెట్స్ ను గేట్ వేగా భావిస్తున్న మిలీనియల్స్ వీటితో తయారైన వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారాన్ని తీసుకోవడానికి మిల్లెట్స్ మంచి ఎంపిక. రుచితో పాటు నాణ్యమైన ఆహారం చిరుధాన్యాలతోనే సాధ్యం. అంతేకాదు వీటిని వండే సమయం కూడా తక్కువ. 

మిల్లెట్ ఉద్యమం వివిధ కారణాల వలన మిలీనియల్స్ లో ఊపందుకుంది. పురాతన ధాన్యం అయినప్పటికీ  వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలను తినేందుకు కొత్త తరం ఆహార ప్రియులు ఆసక్తి చూపించడం విశేషం. ఈ నేపథ్యంలో మిల్లెట్స్ రాబోయే కాలంలో మరింత ప్రాచుర్యంలోకి రావడంతో పాటు ప్రధానమైనదిగా మారుతుంది. 


 


© 2023 - 2024 Millets News. All rights reserved.