ఆరోగ్యం బాగుండాలంటే ఎన్నో రకాల పోషక విలువలు ఉండేటువంటి ఆకుకూరలు, కూరగాయలు మరియు చిరుధాన్యాలు వంటివి తీసుకోవాలి. మీరోజు వారి ఆహారంలో చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే చాలామంది రాగులు (finger millet), జొన్నలు (jowar millet) వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే అరికెలను (kodo millet) తక్కువ శాతం మంది ఉపయోగిస్తారు.
అయితే రక్తహీనతను తగ్గించుకోవడానికి ఇవి ఎంతో సహాయపడతాయి అని చెప్పవచ్చు. ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా ఈ మిల్లెట్స్ ను తీసుకుంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. దాంతో రక్తహీనతను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉండే కొవ్వును తగ్గించుకోవడానికి కూడా ఇవి ఎంతో సహాయం చేస్తాయి.
ఈ మధ్యకాలంలో నిద్రలేమి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి అరికెలు(kodo millets) ఎంతో సహాయపడతాయి అని చెప్పవచ్చు. ఈ విధంగా మీ రోజువారి ఆహారంలో భాగంగా అరికెలను తీసుకొని ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మిల్లెట్స్ ను ప్రతిరోజు తినడం వల్ల ఎముకలు మరియు కండరాలు చాలా బలంగా మారడానికి సహాయం చేస్తాయి.
కొంత మంది ఎంత ఆహారం తీసుకున్న చాలా నీరసం గా మరియు బలహీనంగా ఉంటారు అలాంటి వారు నీరసం అలసట వంటి సమస్యలను దూరం చేసుకోవాలి అని అనుకుంటే ఈ మిల్లెట్ ను కచ్చితంగా మీరు రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి - సామల వలన ఎన్ని ఉపయోగాలో చూడండి
చాలా మంది చిరు ధాన్యాలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది అని అపోహ పడుతూ ఉంటారు. అయితే సరైన మోతాదు లో మిల్లెట్స్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తుదు. వీటిలో ఉండేటు వంటి ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణ వ్యవస్థ చాలా మెరుగ్గా పని చేస్తుంది. అయితే పిల్లలు మరియు పెద్దలు ఆరోగ్యంగా జీర్ణశక్తిని పెంచుకోవాలి అని అనుకుంటే ఈ అరికెలు (kodo millets) ను తప్పకుండా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల ప్రేగు క్యాన్సర్ వంటి ఎంతో తీవ్రమైన వ్యాధులను కూడా దరిచేరకుండా చూసుకోవచ్చు.
ముఖ్యంగా మధుమేహం వంటి సమస్యల తో బాధ పడుతున్నప్పుడు చాలా మంది చిరు ధాన్యాలను తీసుకోవడానికి భయ పడుతూ ఉంటారు. అయితే మధుమేహ సమస్య ఉన్నవారు కూడా అరికెలు(kodo millet) ను తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల రక్తం లో చక్కెర స్థాయిలు అనేవి పెరగకుండా ఉంటాయి. చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతూ, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే డైట్ లో భాగంగా అన్నం బదులుగా వీటిని చేర్చుకోవడం వల్ల క్రమంగా కొవ్వు అనేది తగ్గుతుంది.
గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా ఈ మిల్లెట్స్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది, దాంతో ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇలా మనం అనేక సమస్యలను తొలగించుకోవచ్చు. సో, ఈ మిల్లెట్స్ ని డైట్ లో చేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోండి.
ఐరన్ లోపం ఉందా? ఈ మిల్లెట్స్ తో మీ లోపాన్ని అధిగమించవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.