ఈరోజుల్లో మిల్లెట్స్ (Millets) వాడకం బాగా పెరిగింది. చాలా మంది, మిల్లెట్స్ ని వాడుతున్నారు. అనేక రకాల మిల్లెట్స్ మనకి అందుబాటులో ఉంటున్నాయి. మిల్లెట్స్ తో రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈరోజు మనం సామలు వలన కలిగే లాభాల గురించి చూద్దాం. సామలు తీసుకుంటే, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సామలతో మనం మరింత ఆరోగ్యంగా మారొచ్చు. అయితే, అసలు సామలు తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చు..?
ఏఏ సమస్యలకి పరిష్కారం సామలతో దొరుకుతుంది అనే వాటి గురించి చూద్దాం. సామలను తీసుకోవడం వలన బాగా చాలా చేస్తుంది. వేసవికాలంలో సామలు (Little Millets) తీసుకుంటే, అద్భుతమైన ఫలితం ఉంటుంది. సజ్జలు (pearl millets), కొర్రలు (foxtail millets), అరికలు (kodo millets), సామలు (little millets) ఇలా చాలా రకాల తృణధాన్యాలు మనకి అందుబాటులో ఉన్నాయి.
సామల వలన కలిగే లాభాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సామల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా రకాల సమస్యల్ని దూరం చేస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడేవాళ్లు సామలు తీసుకోవడం వలన, అద్భుతమైన ఫలితం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సామలను తీసుకోవడం వలన థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్ వంటి జబ్బులు కూడా నయమైపోతాయి. లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఫైబర్ కారణంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళకి సామలు ఒక వరం.
ఇది కూడా చదవండి - కొర్రలను సూపర్ ఫుడ్ అని పిలవడానికి 5 ముఖ్యమైన కారణాలు ఇవే.
డయాబెటిస్ (Diabetes) ఉన్నవాళ్లు సామలు తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. వేగంగా పెరిగిపోకుండా హెల్ప్ చేస్తాయి. ఈ సామల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. డిటాక్సిఫికేషన్ ఫుడ్ గా కూడా సామలు పనిచేస్తాయి. శరీరంలో మలినాలను తొలగిస్తాయి. శ్వాసకోశ వ్యాధుల నుండి కూడా ఉపసమనం లభిస్తుంది. ఇందులో గ్లూటన్ అసలు ఉండదు. గ్లూటన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. ఎటువంటి సమస్య ఉండదు.
సామలు నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తాయి. గుండె జబ్బులు (heart problems) రాకుండా చూస్తాయి. సామలు తీసుకోవడం వలన, వృద్ధాప్య ఛాయలు రాకుండా చూసుకోవచ్చు. వేసవికాలంలో సామలు తీసుకోవడం వలన మరిన్ని లాభాలు ని పొందవచ్చు. వేసవికాలంలో పిల్లలు, పెద్దలు కూడా సామలు తీసుకోవడం మంచిది. సామలు బాగా చలవ చేస్తాయి. అందుకని వేసవికాలంలో తప్పక తీసుకోండి. చలికాలంలో కొర్రలు తింటే మంచిది.
సామలు ని ఎలా తినాలి అని ఆలోచిస్తున్నారా..? అన్నంలా తీసుకోవచ్చు లేదంటే ఉప్మా, పరాటా లేకపోతే కిచిడి వంటి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. బాబోయ్ మిల్లెట్స్ కదా కాస్త హెవీగా ఉంటాయి జీర్ణం అవుతాయా..? అని ఆలోచించకండి. ఏ రూపంలో వండుకున్నా సామలు ఈజీగా జీర్ణం అయిపోతాయి. అయితే స్టార్టింగ్ లో మీరు వారానికి రెండు మూడు సార్లు తీసుకోండి. తర్వాత క్రమంగా రెగ్యులర్ గా తీసుకోవచ్చు.
సామలను తీసుకోవడం వలన అజీర్తి, అతిసారం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మహిళలు తీసుకుంటే, పీరియడ్ సమస్యలు కూడా తగ్గుతాయి. మైగ్రేన్ సమస్యలు ఉన్నవాళ్లు కూడా సామలు తీసుకోవడం మంచిదే. ఉపశమనం కలుగుతుంది. కీళ్లనొప్పులు, ఊబకాయం సమస్యలు కూడా తగ్గిపోతాయి. పీసీఓడీ తో బాధపడే వాళ్ళు సామలు తీసుకుంటే సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు. కడుపు ఉబ్బరం, గుండెలో మంట వంటివి కూడా సామలు తొలగించగలవు. ఇలా సామలు సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఇక ఏమీ ఆలోచించకండి. ఈరోజే సామలను డైట్ లో చేర్చుకోండి. అద్భుతమైన లాభాలని పొందండి.
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంచాలి అంటే ఈ మిల్లెట్స్ మీ మీల్ లో ఉండాల్సిందే
© 2023 - 2024 Millets News. All rights reserved.