ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. అందరు ఆరోగ్యం బాగుండాలని ఈ రోజుల్లో మళ్లీ పురాతన పద్ధతుల్ని పాటించడం మొదలు పెట్టారు. మిల్లెట్స్ (Millets) నిజానికి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది. చాలా రకాల అనారోగ్య సమస్యల్ని, మిల్లెట్స్ తో దూరం చేసుకోవచ్చు.
మిల్లెట్స్ ని తీసుకుంటే, ఎటువంటి లాభాలు పొందవచ్చు..?, ఏఏ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వంటి విషయాలని ఇప్పుడే చూసేద్దాం. మరి మిల్లెట్స్ ని తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడే చూసేయండి. ఈ బెనిఫిట్స్ ని చూశారంటే, కచ్చితంగా ఈ రోజే మీరు మిల్లెట్స్ ని తీసుకోవడం మొదలుపెడతారు. అరికలు (kodo millets), సామలు (little millets), సజ్జలు (pearl millets), కొర్రలు (foxtail millets) ఇలా రకరకాల మిల్లెట్స్ వున్నాయి.
రెగ్యులర్ గా మిల్లెట్స్ ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా ఉపశమనం దొరుకుతుంది. గుండె ఆరోగ్యం (Heart health) కూడా మెరుగుపడుతుంది. ఎముకలు కూడా దృఢంగా మారతాయి. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన ఎటువంటి నష్టం కూడా ఉండదు. మిల్లెట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిలో గ్లూటెన్ అసలు ఉండదు. ఈ కారణంగా టైప్ టు డయాబెటిస్ (Diabetes) తో బాధపడే వాళ్ళకి మిల్లెట్స్ ఎంతగానో సహాయం చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి.
మిల్లెట్స్ తో తీసుకోవడం వలన ముఖ్యంగా మనం ఈ 8 లాభాలని కూడా పొందవచ్చు. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన, రోజంతా కూడా ఎనర్జిటిక్ (energy) గా ఉండవచ్చు. మిల్లెట్స్ లో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ మంచి ఎనర్జీని ఇస్తాయి. రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఎన్ని పనులు చేసుకున్నా అలసట ఉండదు. ప్రతి రోజు మిల్లెట్స్ ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలకు కూడా గుడ్ బై చెప్పేయొచ్చు. మిల్లెట్స్ లో గ్లూటన్ ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
మిల్లెట్స్ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని (Immunity) కూడా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మార్గాల కోసం చూస్తున్నారు. కనుక మిల్లెట్స్ ని చేర్చుకున్నట్లైతే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి కూడా అవుతుంది. మిల్లెట్స్ లో ఉండే ఫైబర్ అలానే విటమిన్స్, మినరల్స్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. బరువు తగ్గేందుకు (Weight loss) సహాయం చేస్తాయి. మిల్లెట్స్ ని తీసుకోవడం వలన ఇవే కాదు. స్కిన్ హెల్త్ కి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది.
వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారా? ఈ మిల్లెట్స్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చు.
మిల్లెట్స్ ని తీసుకోవడం వలన డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అలానే మిల్లెట్స్ ని తీసుకోవడం వలన అందమైన కురులని పొందడానికి కూడా అవుతుంది. మిల్లెట్స్ ని రోజూ తీసుకుంటే, జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. అలానే, గుండె ఆరోగ్యానికి కూడా మిల్లెట్స్ ఎంతగానో సాయం చేస్తాయి. మిల్లెట్స్ ని తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
మిల్లెట్స్ ని తీసుకోవడం వలన బీపీ (BP) ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది బీపీ షుగర్ తో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకి మిల్లెట్స్ వరం అని చెప్పొచ్చు. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఎక్కువ ఫైబర్ వలన షుగర్ తో బాధపడే వాళ్ళకి దివ్య ఔషధంలా మిల్లెట్స్ పనిచేస్తాయి.
చూశారా మిల్లెట్స్ వలన ఎన్ని సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనేది. నిజంగా మిల్లెట్స్ సూపర్ ఫుడ్. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్, బీ కాంప్లెక్స్, విటమిన్స్, మినరల్స్, ఐరన్, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక రెగ్యులర్ గా మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. పిల్లలకి కూడా మిల్లెట్స్ ఇవ్వచ్చు. అలానే పెద్దలు, గర్భిణీలు కూడా మిల్లెట్స్ ని తీసుకోవచ్చు.
ఆరు నెలలు దాటిన పిల్లలకి మిల్లెట్స్ ని పొడిచేసి, తక్కువ పరిణామంలో పెట్టొచ్చు. 10 నెలల తర్వాత మిల్లెట్స్ తో రెసిపీస్ ని ఏమైనా తయారు చేసి పెట్టొచ్చు. మిల్లెట్స్ ని నానబెట్టిన తర్వాత వాటిని వండుకోవడం మంచిది. చాలామంది మిల్లెట్స్ ని అన్నానికి బదులుగా వండుకుని తింటున్నారు. మీకు ఎలా వీలైతే ఆ విధంగా మిల్లెట్స్ ని డైట్ లో చేర్చుకోండి. ఈ లాభాలు అన్నిటిని పొంది అనారోగ్య సమస్యలకే చెక్ పెట్టేయండి. ఆరోగ్యాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకోండి.
© 2023 - 2025 Millets News. All rights reserved.