చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్న విషయం అందరికీ బాగా తెలుసు, కానీ చాలామంది ఇప్పటికీ చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోలేకపోతున్నారు. కొందరేమో చిరుధాన్యాలు తినడానికి రుచిగా ఉండవు అని అనుకుంటారు. మరికొందరేమో వాటిని వండుకునే సమయం మా వద్ద లేదని చెబుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యాయామాలకు అలాగే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వండుకోవడానికి ఎప్పుడు సమయం లేదు అని చెప్పకూడదు. ఆరోగ్యానికి సమయం కేటాయించకపోతే అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడటానికి సమయం ఏర్పర్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో బాధపడకూడదు అని అనుకుంటే ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
చిరుధాన్యాలతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు, కొర్రలు, సాములు, ఆరికలు, అండు కొర్రలు, వంటి వాటితో ఉప్మా, ఇడ్లీ, కిచిడి వంటివి వండుకోవచ్చు. లేదా ఈ ధాన్యాలను నేరుగా అన్నంలానే వండుకోవచ్చు. మిగిలిన చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలతో రొట్టెలను తయారు చేసుకొని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. అందుకే చాలామంది వీటిని దూరం పెడుతూ ఉంటారు.
మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ - ఇక్కడ క్లిక్ చేయండి
ఉద్యోగాలు చేసుకునే వారికి…బ్యాచిలర్స్ కి…అలాగే క్షణాల్లో ఆహారం తయారవ్వాలి అని అనుకునే వారికి సూప్ అనేది బెస్ట్ ఆప్షన్. సూప్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కడుపు నిండిన భావనని కూడా ఇస్తుంది. డైట్ ఫాలో అయ్యేవారు తప్పనిసరిగా రోజులు ఒక్కసారి అయినా సూప్ లను తీసుకుంటూ ఉంటారు. ఈమధ్య చాలా రకాల సూపులు అందుబాటులో ఉన్నాయి. ఈ సూప్ పౌడర్లు నేరుగా మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్యాకెట్ లో ఉన్న సూప్ పౌడర్ ని తెచ్చి వేడివేడి వీటిలో కలిపితే సూప్ రెడీ అంటూ రకరకాల యాడ్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి.ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి కావు…ఆరోగ్యానికి హానికారక మైనవి.ఇలాంటి సుపుల కి పెద్దగా సమయాన్ని కేటాయించాల్సిన పనిలేదు కానీ ఆరోగ్యం మాత్రం త్వరగా దెబ్బతింటుంది.
ఆరోగ్యకరమైన మరియు తయారు చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేని చిరుధాన్యాలతో సూప్ (millets soup) ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఏ చిరుధాన్యాన్ని వాడాలి అని అనుకున్నా ఎలా వాడాలి అని అనుకున్నా ముందుగా వాటిని ఆరు నుండి ఎనిమిది గంటలసేపు తప్పకుండా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సూప్ ఏ కదా పెద్దగా నానబెట్టుకోవాల్సిన పనిలేదు అని అనుకుంటే తప్పే. ముందుగా కొలలను ఏడు గంటలసేపు నానబెట్టుకోవాలి. చిరుధాన్యాన్ని ఎప్పుడూ కూరగాయలతో కలిపి తీసుకోవాలి. కొందరికి ధాన్యాలు జీర్ణం కాకపోవచ్చు. అలాంటివారు తప్పకుండా చిరుధాన్యంతో పాటు కూరగాయలను తీసుకోవాలి. కనుక మనకు నచ్చిన కూరగాయలను చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. ఉదాహరణకు బీన్స్ మరియు క్యారెట్లను తీసుకుందాం. కూరగాయలతో పాటు ఏదో ఒక ఆకుకూరని కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు పాలకూరని తీసుకుందాం. నానబెట్టుకున్న కొర్రలకు నాలుగింతల నీళ్లను వేసుకోవాలి. తరిగిన కూరగాయలను కూడా వేసుకోవాలి. వీటిలోకి ఉప్పు కాస్త మిరియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. దాదాపు ఇది ఉడకడానికి 40 నిమిషాలు పట్టవచ్చు. మనం తీసుకున్న కొర్రలు అలాగే కూరగాయలు ఆకుకూర పూర్తిగా ఉడికిందో లేదో సరి చూసుకోవాలి. ఉడికిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే. వీటిలో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు. మసాలాలు కూడా వాడలేదు. ఇందులో ఎలాంటి వ్యర్థ పదార్థాలు కూడా లేవు. కొర్రలు బరువు తగ్గడానికి ఉపయోగపడితే, వాడిన కూరగాయలు అలాగే ఆకుకూరలు శరీరానికి మంచి ఫైబర్ అలాగే విటమిన్స్ ని అందిస్తాయి. ఈ సూప్ ని (millets soup) చాలా రకాలుగా వండుకోవచ్చు. కొర్రల స్థానంలో అండు కొర్ర లను, సాములను, ఊదలను, ఆరికలను కూడా వాడుకోవచ్చు. ఇక కూరగాయల స్థానంలో సొరకాయ, బీరకాయ క్యాప్సికం వాడుకోవచ్చు. ఇక ఆకుకూరల స్థా నంలో మెంతికూర వాడుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు చిరుధాన్యాలతో పాటు మెంతికూరని వాడి సూట్ చేసుకోవడం ద్వారా డయాబెటిస్ త్వరగా తగ్గుతుంది.
వైట్ రైస్ బదులు మిల్లెట్స్ తీసుకోవాలి అంటే ఎలాగో చూడండి.
ఇప్పటిదాకా మనం ధాన్యాలతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు చిరుధాన్యాలలో మరోరకమైన రాగులు సజ్జలు జొన్నలతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉదాహరణకు రాగులను తీసుకుందాం. ముందుగా కప్పు రాగుల పిండిని తీసుకోవాలి. రాగి పిండిని పాన్ లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి గుమగుమలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మూకుడు కొంచెం నూనె వేసుకోవాలి. నూనెలో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై అందులో కి ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కి మనం కావాలి అని అనుకున్న కూరగాయలను వేసుకోవచ్చు. ఉదాహరణకు సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ మరియు స్వీట్ కార్న్ వేసుకుందాం…అలాగే ఏదైనా ఒక ఆకు గురించి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు మనం మెంతికూరను తీసుకుందాం. మనం తీసుకున్న ఆకుకూరని అలాగే కూరగాయలని తప్పకుండా సన్నగా తరగతి ఉండాలి. ఇలా ఇది కాస్త వేగి మగ్గనివ్వాలి. మనం ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను కనుక నాలుగు కప్పుల నీటిని తీసుకోవాలి. నాలుగు కప్పుల నీటిని వేగుతూ ఉన్న కూరగాయల ముక్కల్లో వేయాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. మరోవై పు వేయించిన పిండిలో మూడు నుండి నాలుగు స్పూన్ల నీరు వేసి చిక్కటి స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన ఈ స్లరీ నీ కొడుకుతో ఉన్న కూరగాయల నీటి లో వేసి ఉండలు కట్టకుండా రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా దాదాపు 20 నిమిషాలు ఉడకాలి. అలాగే సూప్ కూడా చిక్కబడాలి. కొంత సమయాని కి కమ్మటి వాసన వస్తుంది. ఇలా వాసన రాగానే సూప్ (millets soup) తయారయ్యింది అని అర్థం. ఈ సూప్ ని కేవలం రాగి పిండితో మాత్రమే కాదు జొన్న పిండితో కూడా తయారు చేసుకోవచ్చు.సజ్జల పిండి తో కూడా తయారు చేసుకోవచ్చు
ఇలా చిరుధాన్యాలతో రెండు రకాల సూప్ లను (millets soup) ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాలను తింటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో అలాంటి ఉపయోగాలు ఈ సూప్ లను తాగడం ద్వారా కూడా లభిస్తుంది
© 2023 - 2024 Millets News. All rights reserved.