వయసు ప్రకారంగా ఎవరు ఎలాంటి మిల్లెట్స్ తీసుకోవచ్చు?

వయసు ప్రకారంగా ఎవరు ఎలాంటి మిల్లెట్స్ తీసుకోవచ్చు?

వయసు ప్రకారంగా ఎవరు ఎలాంటి మిల్లెట్స్ తీసుకోవచ్చు?

 

వ్యాధి వచ్చిన వెంటనే చికిత్స తీసుకోవడానికి ఆసుపత్రికి పరుగులు తీస్తాం. డాక్టర్లు రకరకాల టాబ్లెట్లను రాసి ఇస్తారు. వాటిని సమయానికి వేసుకుంటూ అదే జీవితం అంటూ చాలామంది గడిపేస్తూ ఉంటారు. కొందరు మాత్రమే వచ్చిన వ్యాధిని దూరం చేసుకోవాలి అని అనుకుంటారు. వ్యాధిని దూరం చేసుకోవాలి అంటే కేవలం టాబ్లెట్లను వాడుతూ ఉంటే సరిపోదు. టాబ్లెట్లతో పాటు వ్యాధిని ఎలా అదుపులో పెట్టాలో కూడా తెలుసుకొని ఆ చిట్కాలను తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

వ్యాధికి టాబ్లెట్ వేసుకోవడం అనేది అప్పుకి వడ్డీ కట్టడం లాంటిది, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం అలాగే ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పాటు చేసుకోవడం అన్నది అసలు డబ్బులను కట్టి అప్పుని పూర్తిగా తీర్చుకోవడం లాంటిది. కనుక వ్యాధి వచ్చినప్పుడు ఆసుపత్రికి పరిగెత్తడం కాకుండా వ్యాధిని దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండేలా జీవనశైలిని ఏర్పాటు చేసుకోవాలి. ఈమధ్య చిరుధాన్యాల గురించి అందరూ వినే ఉంటారు. వీటిని తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ 90% మంది వ్యాధి ఉన్నవారు మాత్రమే ఈ చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకొని ఉంటారు. వ్యాధి రాక ముందు చాలామంది తమకు నచ్చిన ఆహారాన్ని నచ్చినట్టు తింటూ ఉంటారు.

     పదేళ్ల క్రితం ఈ చిరుధాన్యాలపై ఎవరికి పెద్దగా  అవగాహన ఉండేది కాదు. కానీ నేడు చాలామందికి వీటిపై అవగాహన ఉంది. పూర్తి అవగాహన వచ్చేసరికి శరీరం కూడా పూర్తిగా రోగాలతో నిండిపోయి ఉంది. కానీ ఇలాంటి తప్పు మన తరువాతి తరం వారు చేయకుండా ఉండాలి అంటే మనం ఇప్పటి నుండే వారికి మంచి ఆహారపు అలవాట్లని నేర్పించాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉండగలరు.

చిరుధాన్యాలని ఏ వయసు నుంచి ప్రారంభించాలి, ఏ వయసు వారికి ఎలాంటి రూపంలో ఇవ్వాలి, ఏ వయసు వారికి ఏ చిరుధాన్యాన్ని ఎక్కువగా అందించాలో తెలుసుకుందాం

మొదట పుట్టిన బిడ్డకి తప్పనిసరిగా తల్లిపాలు నీ అందించడం ఎంతో అవసరం. తల్లిపాలకి మించిన పౌష్టికరమైన ఆహారం శిశువుకి ఇంకెక్కడ లభించదు. ఎప్పుడైతే శిశువు తల్లి పాలను విడిచిపెట్టి ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెడతాడు అప్పటినుండి చిరుధాన్యాలను శిశువుకి అందించవచ్చు.

6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు పెట్టాల్సిన చిరుధాన్యాలు

 దాదాపు 6 నెలల వరకు శిశువు తల్లి వద్ద పాలన తాగుతాడు. ఆపై శిశువుకి చిరుధాన్యాలలో ప్రధానమైన కొరలను అందించడం ద్వారా వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొర్రలలో ప్రోటీన్ మరియు ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. ఇందులో లభించే ప్రోటీన్ గోధుమలలో (wheat)  లభించే ప్రోటీన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కొర్రలను ఆహారంగా పెట్టడం ద్వారా వారిలో శారీరక అభివృద్ధి బాగా పెరుగుతుంది. అలాగే ఈ కొర్రలలో ( Foxtail Millets )విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. అందులోనూ బి12 మరింత పుష్కలంగా లభిస్తుంది. తద్వారా పిల్లల మానసిక అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది. కొర్రలలో లేసితిన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం నెర్వస్ సిస్టం ని బలపరుస్తుంది. కనుక ఎలాంటి బాధ మరియు అనుమానం లేకుండా కొర్రలను పిల్లలకు ఆహారంగా పెట్టవచ్చు.

ఎలా పెట్టాలి? 

పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టినా అది త్వరగా జీర్ణం అయ్యే విధంగా ఉండాలి. అందుకే చాలామంది బియ్యంతో చేసిన ఇడ్లీలను పెడుతూ ఉంటారు. లేదా పెరుగు కలిపిన అన్నాన్ని పిల్లలకు పెడుతూ ఉంటారు. వీటికి బదులుగా కొర్రలను ఏ విధంగా పిల్లలకు పెట్టాలో తెలుసుకుందాం.

ముందుగా కొర్రలను ( Foxtail Millets ) ఎప్పటిలాన్ని ఆరు గంటల నుండి 8 గంటలసేపు నానబెట్టుకోవాలి. అలాగే పెసరపప్పుని కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్క కప్పు కొర్రలకు రెండు నుండి మూడు స్పూన్ల పెసరపప్పుని తీసుకోవాలి. రెండిటిని బాగా ఉడికించుకోవాలి. వీలైతే కుక్కర్లో పెట్టి నాలుగు నుండి ఐదు విజిల్స్  వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఎక్కువ ఉడికించుకోవడం ద్వారా వండిన పదార్థం చాలా మెత్తగా తయారవుతుంది. ఇందులోకి కొంత ఉప్పు జీర్ణం కోసం కొంత జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పిల్లలకు తినిపించడమే, వండుకున్న పదార్థం కాస్త పల్చగా ఉంటే మంచిది. కావాలి అనుకుంటే ఈ కొర్రల మిశ్రమంలోకి నచ్చిన కూరగాయని కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఇలా పిల్లలకు చిరుధాన్యాలు అలవాటు చేయాలి.

నాలుగేళ్ల నుండి ఎనిమిదేళ్ల వరకు

ఈ వయసులో పిల్లల్లో గ్రోత్ అనేది మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కండరాలు ఎముకలు బలంగా తయారవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పిల్లలకు రాగులతో చేసిన ఆహార పదార్థాలను పెట్టడం ద్వారా వారికి కాల్షియం బాగా లభిస్తుంది. ఈ క్యాల్షియం అప్పుడే తయారవుతూ ఉన్న కండరాలు అలాగే ఎముకలు మరింత బలంగా తయారయ్యేందుకు తోడ్పడుతాయి. అలాగే ఆరికలను కూడా పిల్లలకు ఆహారంగా అందించవచ్చు. ఆరికలలో శరీరం బలపడటానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని లభిస్తాయి. ఐరన్, క్యాల్షియం, అలాగే విటమిన్ బి కూడా లభిస్తుంది. ఈ సమయంలో పిల్లల యొక్క చర్మం లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఆరికలలో ఉండే విటమిన్ ఈ ద్వారా చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.

నాలుగు నుండి ఎనిమిదేళ్ల పిల్లలకు చిరుధాన్యాలను ఏ విధంగా పెట్టాలి? 

సాధారణంగా ఆరు నెలల శిశువు మనం ఏది పెడితే అది తింటారు. మనం ఏది అలవాటు చేస్తే వారు ఆహార పదార్థాన్ని అలవాటు చేసుకుంటారు. కానీ నాలుగేళ్లు వచ్చిన తర్వాత పిల్లవాడికి కొత్త కొత్త రుచులపై ఆసక్తి కలుగుతుంది. మనం మూడు సంవత్సరాల వరకు పిల్లలకు చిరుధాన్యాన్ని జావా రూపంలో అందించాం. ఇప్పుడు ఇవే చిరుధాన్యాలను కొంత సాలిడ్స్ రూపంలో కూడా అందించవచ్చు. అంటే చిరుధాన్యాలతో ఇడ్లీ లేదా కిచిడిని తయారు చేసి పిల్లలకు పెట్టవచ్చు.

రాగులను అధికంగా పెట్టాలి కనుక రాగులతో ఇడ్లీ చేసి పెట్టడం చాలా మంచిది. సాధారణ ఇడ్లీ పిండిలో రాగి పిండిని కలిపి కూడా ఇడ్లీ లాగా తయారు చేయవచ్చు, లేదా ముందు రోజే రాగులను మినప్పప్పుతో కలిపి నానబెట్టుకొని రుబ్బినా పిండితో కూడా రాగి ఇడ్లీలను (Ragi Idly)  తయారు చేయవచ్చు. సాధారణ ఇడ్లీలతో పోలిస్తే వీటి ద్వారా పిల్లలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే పిల్లలకు మధ్యాహ్నపు సమయంలో కిచిడీని తయారు చేసి ఇవ్వవచ్చు.

రాగుల కిచిడి రెసిపీ గురించి తెలుసుకోవాలి అనుకున్నవారు ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేసి, తెలుసుకోవచ్చు - రాగులతో ఈ రెసిపీలు చేస్తే కుటుంబం అంతా ఆరోగ్యమే.

8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు

ఈ సమయంలో పిల్లలు ఎలాంటి ఆహారాన్ని అయినా జీర్ణం చేసుకోగల శక్తిని కలిగి ఉంటారు. కావున ఈ సమయంలో మనం అన్ని రకాల చిరుధాన్యాలని పిల్లలకు అలవాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో చిరుధాన్యం ఒక్కో వ్యాధి రాకుండా కాపాడుతుంది. 8 నుండి 12 ఏళ్ల వరకు పిల్లలు ఒబిసిటీ బారిన పడకుండా ఉండే ఆహార పదార్థాలను అందించాలి. ఎందుకంటే ఈ వయసు లోనే పిల్లలు ఎక్కువగా బేకరీ కి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా త్వరగా బరువు పెరుగుతు ఉంటారు. కావున 8 నుండి 12 ఏళ్ల పిల్లలకు కొర్రలతో ( Foxtail Millets ) తయారుచేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా పెట్టాలి. ఇవి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎదుగుతున్న పిల్లలకు విటమిన్ బి కాంప్లెక్స్ చాలా అవసరం అవుతుంది. కొర్రల ద్వారా వీరికి భవిష్యత్తులో కూడా ఎలాంటి వైటమిన్ లోపం రాకుండా ఉంటుంది.

ఇక 12 ఏళ్ల నుండి 16 ఏళ్ల వరకు ఎరక రకాల రోగాలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో పిల్లలు ఎక్కువ చదువుపై దృష్టి పెడుతూ ఉంటారు. ఈ సమయంలోనే పిల్లలు హై స్కూల్ లో ఉండడం వల్ల ఎక్కువగా చదువుతారు తక్కువగా ఆడుకుంటారు. అంటే తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. మెంటల్ ఆక్టివిటీగా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తప్పనిసరిగా పిల్లలకు చిరుధాన్యాలను ఇవ్వాలి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక్క ధాన్యమే అని చెప్పలేము.. అన్ని చిరుధాన్యాలను ఇవ్వవలసి ఉంటుంది. అదే ఆడపిల్లల్లో అయితే పిసిఒడి లేదా పిసిఓఎస్ (PCOD & PCOS) లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మగ పిల్లల్లో అయితే వీక్నెస్ సమస్యలు, నెర్వస్ సిస్టం సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

ఎలా పెట్టాలి?

8 నుండి 16 ఏళ్ల వరకు పిల్లలు ఎలాంటి ఆహారాన్ని అయినా తినడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి… ఉదయం పూట జావ లా అందించడం చాలా మంచిది. ఎందుకంటే ఉదయం టిఫిన్ తినిన వెంటనే అందరూ బడి కి  వెళ్ళిపోతారు.. వెళ్లినప్పటి నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంతవరకు దాదాపు బెంచీలపై కూర్చొని టీచర్లు చెప్పే విషయాన్ని వింటూ ఉంటారు. కావున వీరికి ఉదయాన్నే లైట్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చిరుధాన్యాలతో చేసిన గంజిని ఇవ్వడం ద్వారా వారికి చాలా లైట్ గా ఉంటుంది. చదువుపై కూడా దృష్టిని పెట్టగలరు. ఇక మధ్యాహ్నం చిరుధాన్యాలతో వండిన అన్నంతో పాటు ఏదైనా కూరగాయతో వండిన కూరని ఇవ్వవచ్చు. ఇక సాయంత్రానికేమో జొన్నలు రాగులు సజ్జలు తో తయారు చేసిన రొట్టెలను ఇవ్వవచ్చు. లేదా అన్ని రకాల మిల్లెట్స్లను గోధుమలతో కలిపి మల్టీ గ్రైండ్ పిండిని తయారు చేసి వీటితో కూడా రొట్టెలను తయారు చేసి ఇవ్వడం ద్వారా కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ సమయంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే చిరుధాన్యాలు తీసుకోవడంతో పాటు హైలీ ప్రాసెసడ్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి.

ఇలా పిల్లలకు చిరుధాన్యాలని ఆహారం గా అలవాటు చేయవచ్చు. పదహారేళ్ల వరకు ఇలాంటి ఆహారానికి అలవాటు పడినవారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు.

నిజానికి పిల్లలు బంకమట్టి లాంటివారు. వారిని మనం ఎలా తీర్చిదిద్ది తే వారు అలానే తయారవుతారు. చిన్నప్పటినుండి వారికి నచ్చిన ఆహారాన్ని తినిపిస్తూ, ఫ్రైడ్,ప్రొసీడ్ ఫుడ్ ని తినిపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు వారు కూడా మనలానే ఆరోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. అలాకాకుండా ఆరు నెలల వయసు ఉన్నప్పటి నుండి 16 ఏళ్ల వయసు దాకా చిరుధాన్యాలను అలవాటు చేయడం ద్వారా భవిష్యత్తులో వారికి అనారోగ్యం అనేది అసలు కలగదు.

 


© 2023 - 2025 Millets News. All rights reserved.