40 ఏళ్ల వయసు వరకు మనం ఎలాంటి ఆహారం తీసుకున్న అరిగించుకునే శక్తి శరీరానికి ఉంటుంది. కానీ ఒక్కసారి 40 ఏళ్లు దాటాక శరీరంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా ఒకలా ఉన్న శరీరం కాస్త మరోలా మారిపోతుంది. డయాబెటిస్ మరియు అధిక బిపి వంటి సమస్యలు మొదలయ్యే స్టేజ్ అది. 40 ఏళ్ల వరకు మనం కేవలం జ్వరం వస్తే తప్పితే మాత్రల జోలికి వెళ్ళాం. కానీ ఒక్కసారిగా 40 ఏళ్లు దాటాక మన వస్తువులలో మాత్రల డబ్బా కూడా చేరుతుంది. ఆహారానికి ముందు ఒకటి ఆహారానికి తర్వాత ఒకటి మధ్యలో ఒకటి అంటూ రకరకాల మాత్రలను మింగల్సి ఉంటుంది. ఇలా డయాబెటిస్ కి బీపీకి మరియు రకరకాల వ్యాధులకు టాబ్లెట్స్ లను తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ కారణంగా 60 ఏళ్లు రాగానే రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. అంటే 40 వయసులో ఉన్న శక్తి కూడా 60 లలో ఉండదు. రోగనిరోధక శక్తి ఏ మాత్రం ఉండదు. అందుకే ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య కలిగిన లేదా వాతావరణంలో టెంపరేచర్ పెరిగిన లేదా తగ్గిన త్వరగా జబ్బు పడిపోతూ ఉంటారు. వయస్సు అయిన సమయంలో కూడా రోగనిరోధక శక్తి శరీరానికి బాగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పకుండా డైట్ లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. చిరుధాన్యాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతల ద్వారా 60 లలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.
వైట్ రైస్ బదులు మిల్లెట్స్ తీసుకోవాలి అంటే ఎలాగో చూడండి.
కొర్రలు
60 ఏళ్ల ముసలి వారిలో సాధారణంగా జీర్ణ సమస్యల అధికంగా ఉంటాయి. వారు అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోలేకపోతూ ఉంటారు. జీర్ణ సమస్యల కారణంగానే శరీరంలో రకరకాల సమస్యలు మొదలవుతాయి.కొందరైతే మూడు పూటలా భోజనం కూడా చేయలేరు. అలాంటివారు కొర్రలను ఏదో ఒక పూట ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఈ కొర్రలు పేగులను క్లీన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా కొర్రలు బాగా ఉపయోగపడతాయి. చిరుధాన్యాలలో అధికంగా ఫైబర్ ఉంటుంది. కొర్రలలో ఉండే ఫైబర్ కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కావున ముసలి వారంతా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యల ద్వారా వచ్చి మిగిలిన ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
అరికెలు
వయసు పైబడిన వారిలో గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. గుండె సమస్యలకి ముఖ్య కారణం శరీరంలోని వివిధ భాగాలలో కొవ్వు పేరుకుపోవడం. శరీరంలో లేదా గుండె చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం ద్వారా గుండె నాళాలు మూసుకుపోతాయి. అప్పుడే హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ ఆరికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. అలాగే ఆర్టెరీస్ లో పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది. ఆరికలలో ఫ్రీ బయోటిక్ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ ప్రీ బయోటిక్ ఫైబర్ ద్వారా గట్ సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి. వైస్ అయినవారికి కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. ఈ ఆరికలలో ఉన్న ఈ ప్రీబయోటిక్ ఫైబర్ కోలన్ క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. మెగ్నీషియం అలాగే పొటాషియం ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. 40 ఏళ్లు దాటగానే చర్మంలో మార్పు వస్తుంది. అప్పటిదాకా మధువుగా మరియు మంచి ఎలాస్టిసిటీ ఉన్న చర్మం కాస్త మృదువత్వాన్ని అలాగే ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ఆరికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా స్కిన్ యొక్క ఎలాస్టిక్ సిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వైస్ అయిన సమయంలో వచ్చే వ్రింకల్స్ ని కూడా ఈ ఆరికలు తగ్గిస్తుంది.
రాగులు
వయసు పైబడిన వారిలో మోకాళ్ళ సమస్యలు అధికంగా ఉంటాయి.. అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది…నడవడానికి కూడా ఎముకల్లో మరియు కండరాల్లో శక్తి ఉండదు. అలాంటివారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలు మరియు కండరాలు తిరిగి శక్తిని పొందుతాయి. ఈ రాగులు స్ట్రెస్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తాయి. ఈ రాగుల ద్వారా డయాబెటిస్ కూడా తగ్గుతుంది. 60 ఏళ్ల వయసులో డయాబెటిస్ ఎప్పుడు కంట్రోల్ లో ఉండాలి. లేదా పూర్తిగా నిల్ లో అయినా ఉండాలి. లేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతాయి. కనుక ముసలివారంతా రోజుల్లో కనీసం ఒక్కసారైనా రాగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ తగ్గడంతో పాటు వాటికి సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా. అంతేకాదు రోగనిరోధక శక్తిని అధికంగా పెంచే ధాన్యం ఈ రాగులే. రాగులలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. ఈ ఆంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఉన్న కణాలు డామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. అలాగే దెబ్బతిన్న ఇమ్యూన్ సిస్టం తిరిగి బాగుపడేలా చేస్తుంది. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న తగ్గడానికి ఈ రాగులు బాగా ఉపయోగపడతాయి. ఇవి క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం మరియు పోస్పిరస్ లాంటి ఖనిజాలను కూడా శరీరానికి కావాల్సిన మోతాదులో అందిస్తుంది.
కావున కొర్రలను ఆరికలను మరియు రాగులను ముసలి వారు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వారి వయసులో వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల నుండి తమని తాము కాపాడుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని హాయిగా జీవితాన్ని గడపవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.