రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారికి జీతంతో పాటు మరియు రోగాలు కూడా అధికంగా లభిస్తాయి. కూలి పని చేసే వారితో పోలిస్తే వీరికి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వీరు సంపాదించుకున్నది మొత్తం ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సాధారణ పనులు చేసుకునే వారితో పోలిస్తే ఇలా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వారు మరి కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వారు మాత్రమే కాదు నేడు చాలా వృత్తులు దాదాపు కూర్చుని చేసేవే. ఒక డ్రైవర్ రోజంతా కూర్చొని బండి నడపాల్సి ఉంటుంది. ఒక వాచ్ మెన్ దాదాపు 10 నుండి 12:00 సమయం కూర్చోవాల్సి ఉంటుంది. ఇలాంటివారు మరి కాస్త ఎక్కువ జాగ్రత్తలను తీసుకోవాలి.
ఇలాంటి పనులు చేసుకునే వారికి వ్యాయామం చేయడానికి పెద్దగా సమయం ఉండదు. ఇలాంటి వారికి శరీరంలో కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలంటే కూడా తప్పకుండా శరీరానికి కదలికలు అవసరం. జీర్ణమైన ఆహారం తిరిగి శక్తిగా మారాలి అనుకున్న కదలికలు చాలా అవసరం. శరీరానికి తగిన శారీరక శ్రమ కనుక లేకపోతే ఆహారంగా తీసుకున్న పదార్థాలలో ఉన్న క్యాలరీలు ఖర్చు కాకుండా కొవ్వులా మారి అవయవాల చుట్టూ పేర్కొంటుంది.
శారీరక శ్రమ లేని వారికి తరచుగా వచ్చే జబ్బులు వాటిని తగ్గించుకునే మార్గాలు:-
అధిక కొలెస్ట్రాల్ కారణంగా మొదట దెబ్బతిని అవయవం మన గుండె. కూర్చుని పని చేసుకునే వారికి గుండె జబ్బులు చాలా ఎక్కువగా వస్తాయి. ఒకప్పుడు పొలాలలో పనిచేసే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కేవలం శారీరక శ్రమ చేసేవారు మాత్రమే కాదు ఇండ్లలో కూర్చొని ఇంటి పని చేసుకునే స్త్రీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఆ కాలంలో వారు తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైనది గా ఉండేది. తక్కువ నూనె తక్కువ ఉప్పు కారం మసాలాలు వాడేవారు. అలాగే పాలిష్ పట్టని ధాన్యాలను వాడేవారు. కనుక శారీరక శ్రమ ఉన్న లేకపోయినా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం మన ఆహారాలవాట్లు పూర్తిగా మారాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తీసుకునే ఆహార పదార్థాలలో నూనె ఉప్పు, కారం మసాలాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలతో పాటు చిరుతిండ్లను కూడా బాగా ఎక్కువగా అలవాటు చేసుకున్నాం. ఇలాంటి ఆహారాలను ప్రతిరోజు విరామం లేకుండా తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. కేవలం శరీర భాగాల వద్ద మాత్రమే కాదు గుండె యొక్క నాళాలను కూడా కొవ్వు బాగా పెరిగిపోతుంది. ఈ కొవ్వు కరగాలంటే తప్పకుండా శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ చేయలేని వారు కనీసం వారు తీసుకునే ఆహారమైన ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. అంటే తక్కువ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ కలిగి ఎక్కువ ఫైబర్ మరియు విటమిన్స్ కలిగి ఉండేదిగా ఉండాలి. కొర్రలను అధికంగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి. కొర్రలలో (Foxtail Millets) వెయిట్ లాస్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. ఈ కొర్రలు శరీరంలో వివిధ భాగాలలో పేర్కొన్న కొవ్వు నీ కరిగిస్తుంది. కొవ్వు కరగడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ కొర్రలు గుండె నాళాలలో పేరుకుపోయిన కొవ్వుని కూడా కరిగిస్తుంది. తద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తకుండా ఉంటాయి. కనుక శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు తప్పకుండా తమ ఆహారంలో కొర్రలను భాగం చేసుకోవాలి.
మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ - ఇక్కడ క్లిక్ చేయండి
రోజంతా ఓకే చోట కూర్చొని ఉంటే ఎవరికైనా కాళ్లు నొప్పులు రావడం సహజం. ఏదైనా ఒక వస్తువుని ఎక్కువ రోజులు వాడకపోతే ఆ వస్తువు త్వరగా పాడైపోతుంది. మన శరీరంలోని అవయవాలు కూడా అంతే. ఒకే చోట కూర్చుని ఉండటం ద్వారా కాళ్లలోని కండరాలు బాగా వీక్ అవుతాయి. అలాగే స్టిఫ్ గా కూడా మారిపోతాయి…కనుక కూర్చుని పని చేసుకునే వారు కనీసం 40 నిమిషాలకు ఒక్కసారి అయినా లేచి ఒక పది నిమిషాలు పాటు నడిచి తిరిగి వచ్చి తమ పని నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాళ్ల నొప్పులతో బాధపడేవారు లేదా కండరాలు వీక్ గా ఉన్నవారు ఆఫీసులలో లిఫ్ట్ బదులు మెట్లను వాడాలి. ఇలాంటివారు కనీసం రోజుకి 45 నిమిషాలైనా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే చోట కూర్చోవడం లేదా కదలికలు లేకపోవడం ద్వారా మజిల్స్ పూర్తిగా దెబ్బతింటాయి. చిరుధాన్యాలలో ఒకటి అయినా సజ్జలను (Pearl Millets) ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కండరాలకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కండరాలకు శక్తిని కలిగిస్తుంది. అలాగే ఆరికలలో ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇవి కీళ్ల నొప్పులకు బాగా ఉపయోగపడతాయి.
కూర్చొని పని చేసుకునే వారు ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి వెన్నుముక కూడా దెబ్బతిని ప్రమాదం ఉంటుంది. కనుక వీరు ఆహారంలో తప్పనిసరిగా రాగులను భాగం చేసుకోవాలి. రాగులలో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను దృఢపరుస్తాయి. ఎక్కువగా కూర్చొని పని చేసుకునే వారిలో ఆస్టియోపొరోసిస్ అని ఒక వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి మెల్లమెల్లగా కండరాలను అలాగే ఎముకలను బాగా వీక్ చేసేస్తూ ఉంటుంది. ఈ ఆస్టియోపొరోసిస్ వెన్నుముకని మరింత వీక్ చేస్తుంది.క్యాల్షియం అధికంగా ఉన్న ఈ రాగులను తీసుకోవడం ద్వారా ఆస్తియోపోరోసిస్ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. కనుక కూర్చొని పని చేసుకునేవారు తప్పకుండా తమ ఆహారంలో రాగులను (Finger Millets) భాగం చేసుకోవాలి.
ప్రతిరోజు ఒకే చోట కూర్చుని ఫోన్ లేదా కంప్యూటర్ చూస్తూ పనిచేసుకునే వారికి కంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే వారికి ఉన్న అధిక స్ట్రెస్ కారణంగా మానసిక సమస్యలు కూడా అధికంగా పెరుగుతూ ఉంటాయి. కంటి సమస్యలు పూర్తిగా తగ్గాలి అంటే కొర్రలను (Foxtail Millets) తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. కొర్రలలో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. ఈ విటమిన్ ఏ కంటి నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కొర్రలలో కేవలం విటమిన్ ఏ మాత్రమే కాదు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా పూర్తిగా లభిస్తుంది. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ లో ఎంతో ముఖ్యమైన బి12 కూడా ఈ కొర్రలలో లభిస్తుంది. ఈ విటమిన్ బి టు వల్ల నర్వస్ సిస్టం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మతిమరుపుని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఈ విటమిన్ బి12 మానసిక సమస్యల ను కూడా తగ్గిస్తుంది. కనుక బి-12 అధికంగా ఉన్న ఈ కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.
వైట్ రైస్ బదులు మిల్లెట్స్ తీసుకోవాలి అంటే ఎలాగో చూడండి.
శారీరక శ్రమ లేకపోయినా ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ఆరోగ్యకరమైన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పై చెప్పబడిన వ్యాధులు సులభమైన మార్గంలో తగ్గించుకోవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.