అలాగే” శ్రీ అన్నా” ( Sri Anna) అనే ప్రోగ్రాం ని కూడా ప్రజల్లోకి తీసుకొని వస్తామని చెప్పింది. దేశం లో చిరు ధాన్యాలను పండించే రెండు కోట్ల మంది చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ శ్రీ అన్న కార్యక్రమం ద్వారా సహాయాన్ని కల్పిస్తాం అని కూడా వారు చెప్పారు.ఈ కార్య్రమం ద్వారా చిన్న రైతుకు కనీస పెట్టుబడి తోనే మంచి లాభాలను పొందగలరు.
భారతదేశంలో రకరకాల చిరుధాన్యాలు పండుతాయి. కొర్రలు, ఆరికెలు, సాములు, పండుకోరలు, ఊదలు, జొన్నలు, రాగులు, సజ్జలు,వంటివి బాగా పండుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల రోగాల భారీ పడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే వీటి ద్వారా రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
మిల్లెట్స్ సూపర్ ఫుడ్ అని మనదేశం ప్రపంచానికి చాటి చెప్పింది : నరేంద్ర మోడీ
ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ చిరుధాన్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా వాటి పంటని అభివృద్ధి చేస్తామని, అలాగే చిరుధాన్యాలని ( Millets) గ్లోబల్ సూపర్ ఫుడ్ గా ప్రమోట్ కూడా చేస్తామని చెప్పడంతో పాటు ఈ విషయాలను తన మేనిఫెస్టోలో కూడా చేర్చింది బీజేపీ. ఇప్పటికే నరేంద్ర మోడీ రాజస్థాన్ పర్యటనలో మిల్లెట్స్ ను ప్రమోట్ చేయడానికి బీజేపీ కృషి చేస్తుంది అని అన్నారు. అంతే కాకుండా రైతులకు ఉచితంగా విత్తనాలు అందించనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ద్వారా చిరు ధాన్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తాజాగా ఈ విషయం బీజేపీ మేనిఫెస్టో లో పెట్టింది.
© 2023 - 2024 Millets News. All rights reserved.