ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్) వంటి స్థితిస్థాపక పంటలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తేమ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం మిల్లెట్స్ వృద్ధి చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో మారుతున్న వాతావరణం దీనికి అనువైనదని చెప్పుకోవచ్చు.
ఆఫ్రికాలో ముత్యాల గింజలు (పెర్ల్ మిల్లెట్స్) లేదా ( బజ్రా), రాగులు ( ఫింగర్ మిల్లెట్స్) సాగు అంశంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి.. చర్చించారు. సెనెగలీస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ( ఐఎస్ఆర్ఏ) మరియు సీఐఎంఎంవైటీ సహకారంతో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వర్క్ షాప్ నిర్వహించింది. మిల్లెట్స్ పంట సాగుతో పాటు పంట అభివృద్ధిలో తలెత్తుతున్న అడ్డంకులను గుర్తించడంతో పాటు చిరుధాన్యాలకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ‘పెర్ల్ మరియు ఫింగర్ మిల్లెట్ విస్తరణలో అడ్డంకులు’ అనే పేరుతో ఈ వర్క్ షాపు నిర్వహించారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రాముఖ్యత:
చిరుధాన్యాలలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు మిల్లెట్స్ సాగు అనుకూలత వంటి అంశాల నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల్లోని మార్పులు మరియు ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాల పంటలను సాగు చేయడంపై అవగాహన కల్పించింది. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు ఆహార భద్రతను పెంపొందించడం వంటి అంశాలు కూడా ఈ కార్యక్రమంలో హైలైట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు.
ఆఫ్రికా మరియు ఆసియానే కాకుండా లాటిన్ అమెరికా, తూర్పు ఐరోపా వంటి ప్రాంతాలలో కూడా చిరుధాన్యాల సాగును అభివృద్ధి చేయడం కోసం పని చేస్తున్నామని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ( ఎఫ్ఏఓ) కు చెందిన మకికో టాగుచి తెలిపారు. అలాగే ఈ ఏడాది చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తితో పాటు వారి సహాకారం కూడా పెరిగిందన్నారు.
మిల్లెట్స్ ఉత్పత్తి పెంపు కోసం వ్యూహాలు:
మిల్లెట్స్ (చిరుధాన్యాలు ) ఉత్పత్తిని పెంచడం కోసం వ్యూహా రచన జరుగుతోంది. ఇందులో భాగంగా. సెనెగల్ లో రానున్న ఐదేళ్ల కాలంలో ఆహార భద్రత, మిల్లెట్స్ ఉత్పత్తి సాధనే లక్ష్యంగా కీలక కార్యక్రమాలను నిర్వహించే విధంగా ప్రణాళిక అమలు చేయబడుతుంది. ఈ క్రమంలో సెనెగల్ వ్యవసాయ మరియు ఆహార సౌర్వభౌమాధికార మంత్రిత్వ శాఖకు చెందిన ‘ Hamidou Diallo ’ అనే వ్యూహాన్ని అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.. చిరుధాన్యాల ఉత్పత్తితో పాటు దిగుబడిని పెంచడంపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం అధిక నాణ్యత కలిగిన విత్తనాలను వినియోగించనున్నారు. తరువాత ఉత్పత్తిదారులకు అవసరమైన పరికరాలను సమకూర్చి సాగుకు వారిని సన్నద్ధం చేయనున్నారు.కాగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో ఈ ప్రణాళిక కీలకంగా పని చేయనుంది.
చిరుధాన్యాల సాగు అభివృద్ధిలో కీలక పాత్ర
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ - ఎరిడ్ ట్రాపిక్స్… మిల్లెట్ సెక్టార్ ను అభివృద్ధి చేయడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఇందులో భాగంగా కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా చిన్నకారు రైతులకు మేలును కలిగించే విధంగా కొత్త పద్ధతులను గుర్తిస్తూ.. వాటిని అమలు చేయడంలో స్థానిక పారిశ్రామిక వేత్తలకు ఈ సంస్థ మద్ధతు ఇస్తుంది. అయితే ప్రాంతీయ విభేదాలు మరియు వివిధ స్థాయిల పెట్టుబడుల నేపథ్యంలో ఆఫ్రికాలో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుంది.
మిల్లెట్ ప్రాసెసర్ల మద్ధతు పెంపు కోసం హర్యానా ప్రభుత్వం కొత్త పథకం
డ్రైల్యాండ్ క్రాప్స్ ప్రొగాం కోసం వినూత్న కార్యక్రమాలు..
సీఐఎంఎంవైటీలో డ్రైల్యాండ్ క్రాప్స్ ప్రొగ్రాం ( డీసీపీ) డైరెక్టర్ నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో మొదటిది తూర్పు, దక్షిణ, పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా నుండి స్టీరింగ్ కమిటీ నేతృత్వంలో ఆఫ్రికా డ్రైల్యాండ్ క్రాప్స్ ఇంప్రూవ్ మెంట్ నెట్ వర్క్ ఏర్పాటు. రెండోవది.. కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో లెగ్యూమ్స్ మైనింగ్ ప్రాజెక్ట్ ( జన్యు వైవిధ్యంపై ఫోకస్), మూడోవది… పెర్ల్ మిల్లెట్స్ లో రాన్సిడిటీని తగ్గించడం వంటి జన్యు సవరణ ప్రాజెక్టులపై పని చేయడం. ఇక చివరగా విజన్ ఫర్ అడాప్టెడ్ క్రాప్స్ అండ్ సాయిల్స్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమం ఉన్నాయి. మిల్లెట్స్ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ‘ మినుములు’ మరింత ప్రాచుర్యం చెందే విధంగా మార్గాలను రూపొందించడం వంటి అంశాలు ఈ నాలుగు కార్యక్రమాల్లో కీలకమైనవి.
© 2023 - 2025 Millets News. All rights reserved.